- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ‘DQ41’ క్రేజీ అప్‌డేట్..!
ఈ సినిమాకు సంబంధించిన ఒక ముఖ్యమైన, భారీ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు.

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. మలయాళంతో పాటు టాలీవుడ్‌లోనూ వరుస హిట్లు అందుకుంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్, గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే కాంబినేషన్‌లో ఒక భారీ పాన్-ఇండియా లవ్ స్టోరీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘DQ41’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చింది చిత్ర నిర్మాణ సంస్థ SLV సినిమాస్ తమ ట్విట్టర్ ద్వారా చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్‌ను పంచుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక ముఖ్యమైన, భారీ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. హిమాలయాల నేపథ్యంలో సాగిన ఈ షెడ్యూల్‌లో హీరో హీరోయిన్లపై కొన్ని అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపారు.
దీనికి సంబంధించిన తదుపరి షెడ్యూల్ చాలా త్వరలోనే ప్రారంభం కానుందని చెబుతూ.. సినిమా అఫీషియల్ టైటిల్ ప్రకటన కోసం కొద్దిరోజులు వేచి చూడాలంటూ ట్వీట్ చేశారు. ఈ క్రేజీ అప్‌డేట్‌తో మెగా లవ్ స్టోరీపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి రవి నేలకుదిటి దర్శకత్వం వహిస్తుండగా.. టాలెంటెడ్ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి తన ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్‌కు ఇది 10వ (SLVC10) మైల్‌స్టోన్ ప్రాజెక్ట్ కావడం విశేషం. ఈ సినిమాలో కేవలం దుల్కర్-పూజా కెమిస్ట్రీ మాత్రమే కాకుండా.. సీనియర్ నటుడు జగపతి బాబు, వర్సటైల్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ, ‘దసరా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.






