Peddi క్రేజ్ మామూలుగా లేదు.. యూకేలో అన్ని టికెట్లు సేల్ అవుట్

by Pulgam srinivas |   (  Updated:2026-05-24 07:38:06  IST  )

తాజాగా పెద్ది టీమ్ యూకే ప్రీమియర్స్‌కు సంబంధించిన 10 వేలకుపైగా టికెట్లు సేల్ అయినట్లు అధికారికంగా ప్రకటించింది.

Peddi క్రేజ్ మామూలుగా లేదు.. యూకేలో అన్ని టికెట్లు సేల్ అవుట్
X

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రంపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ అయ్యి చాలా రోజులవుతోంది. ఓవర్సీస్‌లో ఈ మూవీ బుకింగ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. ఈ చిత్రాన్ని యూకే, ఐర్లాండ్‌లో ప్రత్యాంగిరా సినిమాస్ సంస్థ భారీ స్థాయిలో విడుదల చేయనుంది. ఇందుకోసం ఇప్పటికే అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇక యూకేలో ‘పెద్ది’ ప్రీమియర్స్‌కు సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది.

తాజాగా మూవీ టీమ్ యూకే ప్రీమియర్స్‌కు సంబంధించిన 10 వేలకుపైగా టికెట్లు సేల్ అయినట్లు అధికారికంగా ప్రకటించింది. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండగానే ఈ స్థాయిలో బుకింగ్స్ జరగడం విశేషంగా మారింది. ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనుండటంతో రాబోయే రోజుల్లో పెద్ద స్థాయిలో టికెట్లు సేల్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దాంతో ‘పెద్ది’ ఓవర్సీస్‌లో సరికొత్త రికార్డుల వైపు దూసుకెళ్తోందని మెగా అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ప్రీమియర్స్‌కే ఈ స్థాయి రెస్పాన్స్ రావడంతో సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద అనేక కొత్త రికార్డులు నమోదు చేసే అవకాశముందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

Peddi: ఈరోజు ఆ సమయానికి రిలీజ్ కానున్న ‘హెల్లల్లల్లో’ సాంగ్

Next Story