Dulquer Salmaan: బ్లాక్ బస్టర్ లోకా సీక్వెల్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన దుల్కర్ సల్మాన్

by Chukka Sudharani |

మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘లోకా: చాప్టర్-1 చంద్ర’

Dulquer Salmaan: బ్లాక్ బస్టర్ లోకా సీక్వెల్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన దుల్కర్ సల్మాన్
X

దిశ, సినిమా: మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘లోకా: చాప్టర్-1 చంద్ర’ (Lokah Chapter 1: Chandra). నస్లేన్, టోవినో థామస్, మమ్ముట్టి, సాండీ, అన్నా బెన్ తదితర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి డామినిక్ దర్శకత్వం వహించగా.. దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 28న గ్రాండ్‌గా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇక ఈ సినిమాకు వచ్చిన రెన్పాన్స్ చూసి చిత్ర బృందం తాజాగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా.. మళ్లీ రూ. 100 కోట్ల మూవీతో ఎప్పుడు వస్తారు అని యాంకర్ సుమ ప్రశ్నించగా.. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన దుల్కర్ సల్మాన్.. ‘లోకా: చాప్టర్-2’తోనే వస్తాం అని అన్నారు. అలాగే ఇంకా మాట్లాడుతూ.. ‘లోకా కోసం మేము ఇప్పటివరకు 5 భాగాలను ప్లాన్ చేశాము. అయితే.. ఇప్పుడు చాప్టర్-1 కు వస్తున్న అద్భుతమైన స్పందనను చూసిన తర్వాత.. మేము ప్రస్తుతం చర్చలో ఉన్నాము.. ఎందుకంటే పార్ట్-1 కోసం టీజర్ & ట్రైలర్‌కి కూడా అంచనాలు లేవు. కానీ ఈ రేంజ్ రెస్పాన్స్ తర్వాత ఇతర భాగాలకు మరింత పెద్దగా అందించాల్సిన బాధ్యత మాపై ఉంది’ అని తెలిపారు.

Next Story