Dulquer Salmaan: ఐయామ్ గేమ్ అంటున్న దుల్కర్ సల్మాన్.. ఆసక్తికరంగా టైటిల్ పోస్టర్

by Chukka Sudharani |   (  Updated:2025-03-01 14:38:09  IST  )

‘సీతా రామం’ (Sita Ramam), ‘లక్కీ భాస్కర్’ (Lucky Bhaskar) చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు దుల్కర్ సల్మాన్

Dulquer Salmaan: ఐయామ్ గేమ్ అంటున్న దుల్కర్ సల్మాన్.. ఆసక్తికరంగా టైటిల్ పోస్టర్
X

దిశ, సినిమా: ‘సీతా రామం’ (Sita Ramam), ‘లక్కీ భాస్కర్’ (Lucky Bhaskar) చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). ఈ మలయాళ స్టార్ (Malayalam Star) ప్రజెంట్ వరుస ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తూ సందడి చేస్తున్నాడు. ఇటీవల కాంత చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్‌ (new project)ను అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకు ‘ఐయామ్ గేమ్’ (I'm Game) అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తున్నట్లు తెలుపుతూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఒక జత చేతులు కనిపిస్తుండగా.. ఒక చెయ్యికి గాయాలయ్యాయి కట్టు కట్టి ఉండగా.. మరోక చేతిలో ప్లేయింగ్ కార్డ్ (Playing card) కూడా మనం చూడవచ్చు. ఇక ఈ పోస్టర్‌తో ‘ఐయామ్ గేమ్’ చిత్రం యాక్షన్-ప్యాక్డ్ వెంచర్‌గా తెరకెక్కనున్నట్లు అర్థం అవుతోంది. 2023లో వచ్చిన ‘కింగ్ ఆఫ్ కోతా’ తర్వాత మలయాళంలో మళ్లీ ఇప్పుడు ఈ మూవీ ప్రకటించాడు దుల్కర్. ఈ గ్యాంగ్‌స్టర్ (Gangster) యాక్షన్ చిత్రంతో అభిలాష్ జోషి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. కాగా.. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story