- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మన ‘బంగారం’ డబ్బింగ్ స్టార్ట్.. క్యూట్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
by Chukka Sudharani |
సమంత, నందిని రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న ‘మా ఇంటి బంగారం’ డబ్బింగ్ స్టార్ట్ అయినట్లు తెలుపుతూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.

X
దిశ, సినిమా: త్వరలో ‘మా ఇంటి బంగారం’తో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్నది స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు. ‘ఓ బేబీ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకురాలు నందిని రెడ్డితో కలిసి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే మూవీ రిలీజ్ డేట్‌తో పాటు మరో అప్డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ‘‘మా ఇంటి బంగారం’ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా మే 15న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది’ అని తెలిపారు. అలాగే సమంత తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ కూడా స్టార్ట్ చేసినట్లు తెలుపుతూ.. సమంత డబ్బింగ్ ఫొటోను షేర్ చేశారు.
Next Story






