దృశ్యం: తెలుగు అభిమానులకు షాక్ ఇచ్చిన మేకర్స్

by Pulgam srinivas |

'దృశ్యం 3' మలయాళ వర్షన్‌ను నేరుగా తెలుగు డబ్బింగ్‌తో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

దృశ్యం: తెలుగు అభిమానులకు షాక్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, వెబ్ డెస్క్: మలయాళంలో విడుదలై అద్భుతమైన ప్రేక్షకాదరణ పొందిన దృశ్యం ఫ్రాంచైజీకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా, మీనా హీరోయిన్‌గా రూపొందిన ఈ సినిమాను తెలుగులో వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో రీమేక్ చేశారు. ఈ వెర్షన్ కూడా మంచి విజయాన్ని సాధించింది. అదే తరహాలో దృశ్యం 2 ను కూడా మలయాళంలో మోహన్‌లాల్‌తో రూపొందించగా, తెలుగులో వెంకటేష్‌తో రీమేక్ చేశారు. ఈ చిత్రం కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందింది. ఇక మలయాళంలో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో రూపొందిన దృశ్యం 3 తెలుగులో వెంకటేష్‌తో రీమేక్ ఉంటుందని అభిమానులు భావించారు. అయితే ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా మే 21న విడుదల కానుంది. అయితే ఈసారి తెలుగు వెర్షన్‌గా ప్రత్యేక రీమేక్ కాకుండా మలయాళ వర్షన్‌ను నేరుగా తెలుగు డబ్బింగ్‌తో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మలయాళంలో ప్రమోషనల్ కంటెంట్ విడుదల కాగా ఇతర భాషల్లో ఇంకా విడుదల చేయలేదు. త్వరలోనే వాటిని కూడా విడుదల చేసి మే 21న మలయాళంతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

Next Story