Drishyam 3: అమెజాన్ లీగల్ వార్నింగ్.. ఎందుకో తెలుసా?

by Pulgam srinivas |

మోహన్‌లాల్ ‘దృశ్యం 3’ డిజిటల్ హక్కులపై అమెజాన్ ప్రైమ్ వీడియో లీగల్ వార్నింగ్.

Drishyam 3: అమెజాన్ లీగల్ వార్నింగ్.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న దృశ్యం 3 చిత్రంపై మలయాళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ప్రముఖ నటి మీనా హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాను మే 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొంతకాలం క్రితమే ప్రకటించింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి లీగల్ వార్నింగ్ వచ్చినట్లు సమాచారం.

దృశ్యం 3 చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులు పూర్తిగా తమవేనని ఈ సంస్థ స్పష్టం చేసింది. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు పూర్తిగా తమకే ఉన్నాయని ఈ ఓటీటీ సంస్థ అధికారికంగా వెల్లడించింది. అదేవిధంగా, ఎవరైనా అనధికారికంగా ఈ సినిమాను పంపిణీ చేయడం లేదా ప్రసారం చేయడానికి ప్రయత్నిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అమెజాన్ ప్రైమ్ సంస్థ హెచ్చరించింది. ఈ ప్రకటనతో ఈ చిత్ర విడుదలకు ముందే డిజిటల్ హక్కుల విషయంలో పూర్తి స్పష్టత వచ్చినట్లైంది. ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది.

Next Story