- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంపర్ ఆఫర్ అందుకున్న ‘డ్రాగన్’ బ్యూటీ.. టాలీవుడ్ యంగ్ హీరోతో రొమాన్స్!
కొత్త హీరోయిన్లు ఒక్క సినిమాతో హిట్ అందుకుని క్రేజీ హీరోయిన్స్‌గా మారిపోతున్నారు. ఒక్క హిట్ సాధించి ఓవర్ నైట్ స్టార్స్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

దిశ, సినిమా: కొత్త హీరోయిన్లు ఒక్క సినిమాతో హిట్ అందుకుని క్రేజీ హీరోయిన్స్‌గా మారిపోతున్నారు. ఒక్క హిట్ సాధించి ఓవర్ నైట్ స్టార్స్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. దీంతో సినీయర్ హీరోయిన్లు సైడ్ అయిపోతూ యంగ్ బ్యూటీలు ట్రాక్‌లోకి వస్తున్నారు. ఇక అలా నార్త్‌కు చెందిన ఓ ముద్దుగుమ్మ కూడా క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ‘డ్రాగన్ ’చిత్రంలో నటించిన కయాదు లోహర్(Kayadu Lohar) సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హీరోగా నటించిన ఫిబ్రవరి 21న విడుదల కావడంతో అమ్మడు క్రేజ్ భారీగా పెరిగిపోయింది.
ఇందులో తన నటనతో తమిళ ఇండస్ట్రీలోని ప్రేక్షకులనే కాకుండా.. తెలుగు వారి మనసులు కూడా గెలుచుకుంది. తన అందంతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఎక్కడ చూసిన కయాద్ గురించి చర్చించుకుంటున్నారు. అనుపమ కంటే ఎక్కువ సీన్స్‌లో ఉన్న కయాద్ ప్రశంసలు అందుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస అవకాశాలు అందుకుంటున్నట్లు సమాచారం. ప్రజెంట్ ఇదయం మురళి ప్రాజెక్ట్‌లో నటిస్తుండగా.. తాజాగా, ఓ టాలీవుడ్ యంగ్ హీరో సరసన చాన్స్ అందుకున్నట్లు టాక్.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen)‘ఫంకీ’ మూవీలో హీరోయిన్‌గా నటించాలని మూవీ మేకర్స్ సంప్రదించగా.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనుదీప్ కెవి(Anudeep KV) దర్శకత్వం వహిస్తున్నారు. దీనిని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments), ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ(Suryadevara Nagavamsi), సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియా సంగీతం అందిస్తుండగా.. పూజా కార్యక్రమం కూడా పూర్తి అయింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం.
Exciting news!
— Filmy Bowl (@FilmyBowl) February 26, 2025
Kayadu Lohar is collaborating with VishwakSen in the upcoming Funky Movie! 🎬✨#KayaduLohar #VishwakSen #funky pic.twitter.com/Wr41XC34IO






