- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బర్త్‌డే స్పెషల్‌గా భార్యకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన డాక్టర్ బాబు.. వీడియో వైరల్
‘కార్తీకదీపం’(Karthika Deepam) సీరియల్‌తో తెలుగు బుల్లితెర ఆడియన్స్‌కు బాగా దగ్గరయిన నిరూపమ్ పరిటాల(Nirupam Paritala) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘కార్తీకదీపం’(Karthika Deepam) సీరియల్‌తో తెలుగు బుల్లితెర ఆడియన్స్‌కు బాగా దగ్గరయిన నిరూపమ్ పరిటాల(Nirupam Paritala) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఒక్క సీరియల‌్‌తోనే ఇతను ఫుల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇందులో అతను పోషించిన డాక్టర్ బాబు పాత్ర ఆడియెన్స్‌కు బాగా చేరువైంది. అందుకే తన ఒరిజినల్ నేమ్ నిరుపమ్ కంటే డాక్టర్ బాబు అంటేనే అందరూ గుర్తుపట్టే స్టేజ్‌కి వచ్చాడు. ప్రస్తుతం ఆయన ‘కార్తీక దీపం-2’(Karthika Deepam-2) సీరియల్‌లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు.
ఇక అతని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. నిరుపమ్ తన కో యాక్టర్ అయిన మంజుల(Manjula)నే పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరు కలిసి ‘చంద్రముఖి’(Chandramukhi) సీరియల్‌లో నటించగా ఆటైంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత పెద్దల అనుమతితో ఇద్దరూ పెళ్లిపీటలెక్కారు. ఇప్పుడు ఎవరు సీరియల్స్‌లో వారు నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా నిరుపమ్ తన భార్య మంజుల పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు ఓ సర్ ప్రైజ్ ఇచ్చాడు. తన చేతిపై ఆమె పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. ఈ విషయాన్ని అతను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. ‘ఇది నా భార్య పుట్టిన రోజుకు బహుమతిగా నా ప్రైజ్‌గా అందించనున్నాను’ అని ఆయన టాటూ వేయించుకున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన వారందరూ బుల్లితెర ప్రముఖులు, అభిమానులు క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






