- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vijay Deverakonda: ‘VD-12’ నుంచి డబుల్ అప్డేట్.. పవర్ ఫుల్ పోస్టర్‌తో హైప్ పెంచిన రౌడీ హీరో
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)‘అర్జున్ రెడ్డి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)‘అర్జున్ రెడ్డి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత టాక్సీవాలా, ఖుషి, గీత గోవిందం వంటి చిత్రాలతో ఘన విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 2022లో ‘లైగర్’ చిత్రంతో భారీ డిజాస్టర్‌ను చవిచూశాడు. ఇక గత ఏడాది రౌడీ హీరో నటించిన ‘ఫ్యామిలీ స్టార్’(Family Star) కూడా హిట్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వీడి-12, వీడీ-14 చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanuri)దర్శకత్వంలో ‘వీడీ-12’తెరకెక్కుతోంది. ఇక ఇందులో విజయ్ సరసన డాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది.
అయితే ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sithara Entertainments), శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌పై నాగవంశీ(Nagavamsi,), సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి అనౌన్స్‌మెంట్స్ పోస్టర్ తప్ప ఎలాంటి అప్డేట్ విడుదల కాలేదు. ఇక విజయ్ అభిమానులు మాత్రం ఈ సినిమా అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, విజయ్ దేవరకొండ ‘VD-12’ అప్డేట్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, టీజర్ ఫిబ్రవరి 12న రాబోతున్నట్లు వెల్లడించాడు. అంతేకాకుండా ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను షేర్ చేసి హైప్ పెంచాడు. ఇందులో ‘‘ఈ సైలెంట్ కిరీటం రాజు కోసం వెయిట్ చేస్తుంది’’ అని రాసి ఉండగా.. మంటల్లో బంగారు కిరీటం ఉన్నట్లుగా కనిపించింది. ఇక ఈ పోస్ట్‌కు ‘‘మీరంతా ఓపిక పట్టారు. మేము మీ కఠినమైన ప్రేమను అనుభవించాము. మేము ఇప్పుడు మా ప్రపంచం, మా కథ తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాము’’ అనే క్యాప్షన్ జత చేశారు.
You have all been patient.
— Vijay Deverakonda (@TheDeverakonda) February 7, 2025
We have felt your tough love.
We are now ready to open our world, our story and all our hearts to you.
With a Title and Teaser you will be proud of! #VD12 pic.twitter.com/aGkBee1o6S






