బాక్సాఫీస్ వద్ద డబుల్ ట్రీట్.. రాకసా .. బైకర్ ప్రీమియర్స్ రెడీ

by Pulgam srinivas |

ఈ రెండు సినిమాల పెయిడ్ ప్రీమియర్స్‌కు వచ్చే టాక్ ప్రభావం మొదటి రోజు కలెక్షన్స్‌పై పడే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

బాక్సాఫీస్ వద్ద డబుల్ ట్రీట్.. రాకసా .. బైకర్ ప్రీమియర్స్ రెడీ
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో ఏప్రిల్ నెల ప్రారంభం నుంచే సినిమాల సందడి మొదలుకానుంది. ‘బైకర్’, ‘రాకసా’ అనే రెండు సినిమాలు ఏప్రిల్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రెండు చిత్రాల పెయిడ్ ప్రీమియర్స్‌ను ఏప్రిల్ 2న భారీ స్థాయిలో ప్రదర్శించేందుకు మూవీ మేకర్స్ రెడీ అయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా తాజాగా విడుదల చేశారు.

రాకాస

మిస్టరీ-థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్‌ను ఏప్రిల్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా భారీ స్థాయిలో నిర్వహించేందుకు నిర్మాతలు ప్రణాళికలు రూపొందించారు.




బైకర్

ఈ సినిమా బైక్ రేసింగ్ జానర్‌లో తెరకెక్కింది. ఈ చిత్రం ఇండియాలోనే తొలి రేసింగ్ సినిమా అని మేకర్స్ ప్రకటించారు. ఈ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీకి సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్‌ను Dolby Cinema, PCX, HDR వంటి ప్రీమియం ఫార్మాట్స్‌లో ఏప్రిల్ 2వ తేదీన ప్రదర్శించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.




ఈ ప్రీమియర్ షో టాక్ ప్రభావం మొదటి రోజు కలెక్షన్స్‌పై ప్రభావం ఉండే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మంచి టాక్ వస్తే, రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story