Pooja Hegde: ఉత్కంఠను రెట్టింపు చేయడంతో పాటు వినోదాన్ని ట్రిపుల్ చేస్తుంది.. బుట్టబొమ్మ కీలక ప్రకటన

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-24 08:38:04  IST  )

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) అవకాశాలు రాకపోవడంతో కొద్ది కాలంపాటు సినిమాలకు దూరంగా ఉంది.

Pooja Hegde: ఉత్కంఠను రెట్టింపు చేయడంతో పాటు వినోదాన్ని ట్రిపుల్ చేస్తుంది.. బుట్టబొమ్మ కీలక ప్రకటన
X

దిశ, సినిమా: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) అవకాశాలు రాకపోవడంతో కొద్ది కాలంపాటు సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ ‘దేవా’చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. కానీ హిట్ అందుకోలేకపోయింది. ఇక ఈ అమ్మడు ఇటీవల సూర్య సరసన నటించిన ‘రెట్రో’(Retro) కూడా బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది. దీంతో ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని పూజా హెగ్డే వచ్చిన అవకాశాలన్నింటినీ ఒప్పుకుంటుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుంటూ క్రేజీ బ్యూటీగా మారింది. ప్రస్తుతం ఈ అమ్మడు విజయ్-69, ‘కూలీ’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) సరసన ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ మూవీలో జతకట్టబోతుంది.

డేవిడ్ ధావన్ (David Dhawan)దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), మౌని రాయ్, మనీష్ పాల్, చుంకీ పాండే, రాజేష్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ చిత్రాన్ని టిప్స్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రమేష్ తరని నిర్మిస్తున్నారు. ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా, ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్‌నుపూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు ప్రకటించింది. అలాగే ఈ పోస్ట్‌కు ‘‘ఉత్కంఠను రెట్టింపు చేయడంతో పాటు వినోదాన్ని ట్రిపుల్ చేస్తుంది.. రెడీగా ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం పూజా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అది చూసిన నెటిజన్లు వెయిట్ చేయలేకపోతున్నామని కామెంట్లు పెడుతున్నారు.

Next Story