Sri Vishnu: డబుల్ ధమాకా ఆఫర్.. బడా నిర్మాణ సంస్థలో రెండు సినిమాలు చేయనున్న శ్రీవిష్ణు..

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-17 15:55:19  IST  )

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు (Sri Vishnu)నటించిన లేటెస్ట్ మూవీ ‘సింగిల్’ (single).

Sri Vishnu: డబుల్ ధమాకా ఆఫర్.. బడా నిర్మాణ సంస్థలో రెండు సినిమాలు చేయనున్న శ్రీవిష్ణు..
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు (Sri Vishnu)నటించిన లేటెస్ట్ మూవీ ‘సింగిల్’ (single). కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాలో కేతిక శర్మ(Ketika Sharma), ఇవానా(Ivana) హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రానికి కార్తీక్ రాజు(Karthik Raju) దర్శకత్వం వహించగా.. దీనిని గీతా ఆర్ట్స్, కల్యా ఫిల్మ్స్ బ్యానర్స్‌పై నిర్మించారు. వెన్నెల కిశోర్(Vennela Kishore) కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం మే 9న థియేటర్స్‌లో విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇక బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా విడుదలైన ఎనిమిది రోజుల్లోనే 23కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి మూవీ మేకర్స్‌కు ఐదు కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది.

తాజాగా, ‘సింగిల్’ సినిమా చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్‌కు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, వివేక్ ఆత్రేయ, కిషోర్ తిరుమల, రామ్ అబ్బారాజుతో పాటు, అల్లు అరవింద్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన శ్రీవిష్ణు డబుల్ ధమాకా ఆఫర్ ఇచ్చారు. ‘‘సింగిల్ సినిమా చూసిన తర్వాత నేను శ్రీవిష్ణుతో రెండు ప్రాజెక్ట్స్ చేయాలని ఫిక్స్ అయ్యాను. అంతేకాకుండా సైన్ చేసి ఆయనకు చెక్ కూడా ఇచ్చాను. అయితే నేను ఈ విషయం చెప్పిన తర్వాత వెన్నెల కిశోర్ నాకు ఎందుకు ఇవ్వలేదని అడుగుతాడేమో’’ అని ఫన్నీగా అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story