- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి వద్దు.. కానీ అమ్మ అవ్వాలని ఉంది.. బిగ్ బాస్ బ్యూటీ సంచలనం
బుల్లితెర ప్రేక్షకులకు శ్రీసత్య (Sri Satya)ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర ప్రేక్షకులకు శ్రీసత్య (Sri Satya)ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ముద్దమందారం’(Mudda mandaram), ‘త్రినయని’(Trinayani), ‘నిన్నే పెళ్లాడతా’(Ninne Pelladatha) వంటి హిట్ సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 (Bigg Boss Telugu Season 6) ద్వారా మరింత పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం టీవీ షోలు, ఈవెంట్స్, డాన్స్ ప్రోగ్రామ్‌లతో బిజీగా ఉన్నది.
అయితే తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. శ్రీ సత్య మాట్లాడుతూ.. 'నాకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. కానీ పిల్లలు కావాలి, తల్లిగా మారాలనుంది. అందుకోసం నేనే పిల్లలను కనాల్సిన అవసరం లేదు. మన దేశంలో ఎన్నో అనాధ ఆశ్రమాలు ఉన్నాయి. ఫ్యూచర్‌లో కచ్చితంగా ఒక ఆడపిల్లను దత్తత తీసుకుంటాను. మగ పిల్లాడు మాత్రం వద్దు... వాడిని హ్యాండిల్ చేయలేను' అంటూ చెప్పుకొచ్చింది శ్రీ సత్య. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.






