పనికిరాని ట్రోల్స్ చేస్తూ సినిమాను చంపేయకండి.. మ్యూజిక్ డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్

by Chukka Sudharani |

నందమూరి నటసింహం, బాలకృష్ణ (Balakrishna), బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ (Action entertainer) చిత్రం ‘డాకు మహారాజ్’

పనికిరాని ట్రోల్స్ చేస్తూ సినిమాను చంపేయకండి.. మ్యూజిక్ డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: నందమూరి నటసింహం, బాలకృష్ణ (Balakrishna), బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ (Action entertainer) చిత్రం ‘డాకు మహారాజ్’ (Daku Maharaj). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఘన విజయాన్ని అందుకుంది. దీంతో ప్రజంట్ సక్సెస్ ఎంజాయ్ చేస్తు్న్న చిత్ర బృందం.. వరుసగా మీడియాతో ముచ్చటిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన తమన్ (Music Director Taman) సినిమాపై ఎమోషనల్ కామెంట్స్ (Emotional comments) చేశాడు.

‘సక్సెస్ (Success) అనేది చాలా గొప్పది. ఎంత డబ్బు పెట్టిన అది దొరకదు. కానీ ఆ విజయం ఇచ్చే ఎనర్జీ ఎంతో బాగుంటుంది. మనం ముందుకు వెళ్లడానికి, ఓ మొట్టు ఎదగడానికి ఇది ఎంతో సహాయం చేస్తుంది. అందుకే విజయం అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. నాకు నిజంగా సక్సెస్ లేకపోతే ఫిలిమ్ నగర్‌ (Film Nagar)వైపు కూడా వెళ్లలేము. అంత చిన్న చూపు చూస్తారు. కాబట్టి ఎవరు ఎంత చేసిన ఆ సక్సెస్ కోసమే. అలాగే ఓ ప్రొడ్యూసర్ (Producer) విజయాన్ని అందుకుంటే గొప్పగా, నిజంగా, ధైర్యంగా బయటకు చెప్పుకోవాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకుంటే నెగిటివిటీ స్ప్రెడ్ చేసేస్తుంటారు. ఒక సినిమా విజయం వెనుకాల ఓ నిర్మాత ఉన్నాడు. ఎంతో కష్టపడి తెచ్చిపెడతాడు అని ఎవరు అనుకోరు.. వెంటనే ట్రోల్స్ (Trolls) చేస్తుంటారు. దీంతో విజమాన్ని ఆనందించే పరిస్థితి కూడా ఉండదు. పనికిరాని ట్రోల్స్ అండ్ నెగెటివ్ ట్రెండ్‌లు చేస్తూ ఆ సినిమాని చంపేయకండి’ అంటూ ఎప్పుడూ నెగిటివిటీని పీల్చి జీవిస్తున్న కొద్దిమంది నిరుద్యోగ అభిమానులపై తమన్ ఫైర్ అవుతూను ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు.

Next Story