- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Khushi Kapoor: అలాంటివి చూసి మనుషులను అంచనా వేయకండి.. ఖుషీ కపూర్ సెన్సేషనల్ కామెంట్స్

దిశ, సినిమా: అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్(Khushi Kapoor) ‘ది అర్చీస్’(The Archies) సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక ‘లవ్ టుడే’ రీమేక్ లోనూ నటించి మెప్పించింది. అయితే ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలతో ఎంతోమంది ఫాలోవర్స్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం ఖుషీ కపూర్ ‘లవ్ యాపా’ (Love Yapa)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుషీ కపూర్ సెన్సేషనల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.
ఇన్‌స్టా రీల్స్‌పై మాట్లాడిని ఆమె అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘‘ఏఐ కారణంగా ఇంటర్నెట్‌లో చాలా భయంకరమైన విషయాలు చూస్తున్నాం. దీని గురించి అందరికీ అవగాహన పెంచుకుని జాగ్రత్తగా ఉండాలి. మంచికి మాత్రమే ఉపయోగించుకోవాలి. కానీ నిజజీవితంలో మాత్రం కమ్యూనికేషన్ ముఖ్యమని నేను నమ్ముతున్నాను. భాగస్వామి, కుటుంబం, స్నేహితులతో ఎప్పుడూ కొన్ని విషయాలను చర్చించాలి. అయితే నేను కొన్ని రోజుల నుంచి ఓ విషయం గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. అదేంటంటే.. కొంతమంది ఇన్‌స్టాలో కంటెంట్ క్రీయేటర్స్‌పై ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు.
అసలు కేవలం 10 సెకన్ల రీల్ చూసి అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. కానీ ఆ 10 సెకన్ల క్లిప్ నుంచి మీరు ఆ వ్యక్తి గురించి ఏం అర్థం చేసుకోగలరు. మీకు అసలు వారి జీవితం గురించి ఏం తెలియదు. కనీసం వాళ్లు ఏం చేస్తారనే ఆలోచన ఉండదు. అలాంటప్పుడు వారి గురించి అభిప్రాయానికి ఎలా వస్తారు. అవతలి వారు ఎలాంటివారైనా ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. ఎదుటివారిపై మన ఆలోచనలు సరైనవి అనిపిస్తే సరిపోదు. వారు అలాంటి వారు అయితే ఎటువంటి సమస్య ఉండదు కానీ మంచి వారు అయితే బాధపెట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి రీల్స్ చూసి మనుషులను అంచనా వేయకండి’’ అని చెప్పుకొచ్చింది.