- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజమౌళితో నన్ను పోల్చి ఆయన స్థానాన్ని తగ్గించకండి.. అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్
స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shanakara Prasad Garu) మూవీను తెరకెక్కించారు. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanatara) హీరోయిన్‌గా నటించగా వెంకటేష్(Venkatesh) కామియో రోల్ ప్లే చేశాడు. అయితే సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌తో పాటు మూడు కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టింది. దీంతో అనిల్ రావిపూడి సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా మారిపోవడంతో ‘రీజనల్ రాజమౌళి’ అని పిలుస్తున్నారు.
అయితే మన శంకర వరప్రసాద్ గారు మూవీ హిట్ అవ్వడంతో తాజాగా మూవీటీమ్ సక్సెస్ ఫుల్ మీట్‌ను నిర్వహించారు. ఇందులో భాగంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘నన్ను రాజమౌళితో పోల్చడం నా స్థాయి పెంచుకోవడమే. కానీ అది ఆయన స్థాయిని తగ్గించడమే అవుతుంది. ఆయన తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన లెడెంజరీ డైరెక్టర్. నేను నాకు తెలిసిన టైమింగ్‌తో ఎంటర్‌టైనర్స్ చేసుకుంటూ వెళ్తున్నాను. కాబట్టి ఆయనతో పోలిక వద్దు’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Read More..






