స్కూల్ పిల్లల కోసం కోట్ల విరాళం.. సల్మాన్ ఖాన్ గొప్ప మనసు

by Pulgam srinivas |

ఒక స్కూల్‌లో మౌలిక వసతులను మెరుగుపరచడం కోసం సల్మాన్ ఖాన్ 15 కోట్ల రూపాయల విరాళం అందించినట్లు తెలుస్తోంది.

స్కూల్ పిల్లల కోసం కోట్ల విరాళం.. సల్మాన్ ఖాన్ గొప్ప మనసు
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. ఇప్పటికే ఆయన ‘బీయింగ్ హ్యూమన్’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సల్మాన్ ఖాన్ ఒక స్కూల్‌కు ఏకంగా 15 కోట్ల రూపాయల విరాళం అందించినట్లు సమాచారం. ఈ నిధులతో ఆ స్కూల్‌లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు డిజిటల్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. స్కూల్ అభివృద్ధికి ఇంత భారీగా విరాళం అందించిన సల్మాన్ ఖాన్‌కు ఆ స్కూల్ విద్యార్థులు తమ చేతులతో తయారు చేసిన ప్రత్యేక గిఫ్ట్‌ను బహుకరించారు.

కోట్లాది రూపాయల బహుమతులను పెద్దగా పట్టించుకోని సల్మాన్ చిన్నారులు ప్రేమతో ఇచ్చిన ఆ బహుమతిని ఎంతో ఆప్యాయంగా స్వీకరించి ఆనందించారు. అలాగే తమ కృతజ్ఞతలను వ్యక్తం చేసిన విద్యార్థులను చూసి ఆయన భావోద్వేగానికి లోనైనట్లు సమాచారం. సినిమాల్లో కఠినమైన పాత్రల్లో కనిపించే సల్మాన్ ఖాన్ నిజ జీవితంలో ఎంతో సున్నితమైన మనసున్న వ్యక్తి అని ఈ ఘటన ద్వారా స్పష్టమవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే, సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Next Story