- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామెడీ ఎంటర్‌టైనర్ ‘డాన్ బాస్కో’ ఫస్ట్ లుక్ రిలీజ్
రుష్య దత్త డెబ్యూ హీరోగా వచ్చేస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘డాన్ బాస్కో’.

దిశ, సినిమా: రుష్య దత్త డెబ్యూ హీరోగా వచ్చేస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘డాన్ బాస్కో’. ప్రొడక్షన్ హౌస్ రాధా కృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందిస్తోన్న ఈ చిత్రానికి వెంకట్ ఉప్పుటూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. జైలర్, నా సామి రంగ సినిమాలతో గుర్తింపు పొందిన అందాల నటి మిర్నా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్‌లో రుష్య దత్త చాలా స్టైలిష్‌గా కనిపిస్తూ, ఒక చేతిలో కటానా లాంటి కత్తిని పట్టుకుని, మరో చేతితో కాలర్‌ను పైకెత్తుతూ బోల్డ్ పోజ్‌లో కనిపిస్తున్నారు. ‘ప్రతి రీయూనియన్ జ్ఞాపకాల కోసమే కాదు.. కొన్ని విముక్తి (రిడెంప్షన్) కోసం కూడా ఉంటాయి’ అనే క్యాప్షన్ సినిమాపై మరింత ఎగ్జైట్‌మెంట్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఇందులో మురళీ శర్మ ప్రిన్సిపాల్ విశ్వనాథ్ పాత్రలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మిర్నా మీనన్ లెక్చరర్ సుమతి పాత్రలో కనిపించనుంది.






