- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశ్వంభర చుట్టూ ఎన్ని కష్టాలో.. అసలు సమస్య అదేనా?
విశ్వంభర విడుదల తేదీ రావాలంటే ఓటీటీ డీల్ క్లోజ్ కావాల్సిందే.

దిశ, వెబ్ డిస్క్ : మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల క్రితం విశ్వంభర చిత్రాన్ని మొదలు పెట్టాడు. త్రిష ఇందులో హీరోయిన్గా కనిపించనుండగా, మల్లాడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. ఎం ఎం కీరవాణి సంగీత సారథ్యంలో రూపొందుతున్న ఈ మూవీని యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టార్ట్ చేసిన తర్వాత కొంతకాలానికే దీనిని 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన పనులు చాలా పెండింగ్లో ఉన్నాయి అని, దాంతో సంక్రాంతికి కాకుండా వేరే సమయంలో విడుదల చేస్తాము అని, కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత కొంతకాలానికి చిరంజీవి స్వయంగా విశ్వంభరని 2026 సమ్మర్లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ సినిమా ఈ సమ్మర్ లో కూడా విడుదల అయ్యే అవకాశాలు కనబడటం లేదు. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ ప్రకటించలేదు. ఈ మూవీ స్టార్ట్ అయిన తర్వాత చాలా కాలానికి మొదలైన మన శంకర వరప్రసాద్ గారు విడుదల అయ్యి ఇప్పటికే టాలీవుడ్ రీజనల్ ఇండస్ట్రీ హిట్ కావడంతో విశ్వంభర పరిస్థితి ఏమవుతుందా అని మెగా ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం విశ్వంభర మూవీకి సంబంధించిన విడుదల తేదీ అనౌన్స్ కావాలంటే ముందుగా ఓటీటీ డీల్ పూర్తి కావాలి, అది పూర్తి కావాలంటే రేటు ఫైనల్ కావాలి. ధర ఫైనల్ కావాలంటే మొదట కాపీ పూర్తి కావాలని తెలుస్తుంది. దీనిని బట్టి చూస్తే ఈ సినిమా విడుదల తేదీ రావాలంటే మొదట ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ కాపీ రెడీ కావాలి. అది చూసి ఓటీటీ వారు ఒక ధర ఫిక్స్ చేసి, డేట్ కూడా కన్ఫామ్ చేస్తే అప్పుడు ఈ సినిమా విడుదల తేదీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






