రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై డాక్యుమెంటరీ.. రిలీజ్‌ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR)సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకుల ఆదరణ పొందింది.

రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై డాక్యుమెంటరీ.. రిలీజ్‌ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR)సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకుల ఆదరణ పొందింది. అంతేకాకుండా ఆస్కార్‌తో పాటు ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అయితే ఇందులో రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్, అలియా భట్(Alia Bhatt), ఓలివా మోర్రీస్, శ్రియా శరణ్(Shriya Saran) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ 2022లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాపై డాక్యుమెంటరీ(Documentary)ని సిద్ధం చేసినట్లు డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్(DVV Entertainments) అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’(RRR: Behind and Beyond) పేరుతో రాబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ డాక్యుమెంటరీ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుపుతూ రాజమౌళి పోస్టర్ విడుదల చేశారు. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ కీర్తిని ప్రపంచం మొత్తం చూసింది. ఇప్పుడు దీని కథకు ప్రపంచం సాక్ష్యంగా నిలవనుంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. కానీ దీన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తారా..లేక ఓటీటీలోకి రానుందా అనేది మాత్రం వెల్లడించలేదు. ఇక ఈ పోస్ట్ చూసిన సినీ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది.

Next Story