అఖండ-2లో పెద్దయ్యాక బాలయ్య కూతురిగా నటించింది ఎవరో తెలుసా? ఈమెను గుర్తుపట్టారా?

by Naga Rani Yarlagadda |

అఖండ-2 తాండవం కోసం బాలయ్య అభిమానులు, నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

అఖండ-2లో పెద్దయ్యాక బాలయ్య కూతురిగా నటించింది ఎవరో తెలుసా? ఈమెను గుర్తుపట్టారా?
X

దిశ, వెబ్‌డెస్క్: అఖండ-2 తాండవం కోసం బాలయ్య అభిమానులు, నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. శుక్రవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. నటీనటులు సందడి చేశారు. అఖండ-2లో బాలయ్య సరసన సంయుక్త మీనన్ నటించినట్లు ట్రైలర్లో చూపించారు. అలాగే అఖండలో బాలయ్యకు కూతురు ఉండగా.. ఆమె పెద్దయ్యాక ఎలా ఉంటుందనేది కూడా ట్రైలర్లో చూపించారు. అయితే ఆ ముఖాన్ని ఇంతవరకూ తెలుగు ప్రేక్షకులు ఎక్కడా చూసింది లేదు.

అఖండ-2 తాండవంలో బాలయ్య కూతురిగా నటించింది హర్షాలీ మల్హోత్రా. ఈమె బాలీవుడ్ నటి. భజరంగి భాయ్ జాన్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హర్షాలీ.. అఖండ-2తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో హర్షాలీ తన అందంతో, అమాయకమైన చూపులతో అందరినీ మైమరపించింది. ఇక సినిమా రిలీజయ్యాక మన తెలుగు కుర్రాళ్లంతా ఈ బాలీవుడ్ భామను వైరల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Next Story