సునీల్ మనసు దోచుకున్న హీరో ఎవరో తెలుసా.. మళ్లీ సినిమా చేయాలంటూ కామెంట్స్

by Pulgam srinivas |

చిరంజీవి గారితో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలని ఉందని సునీల్ చెప్పుకొచ్చారు.

సునీల్ మనసు దోచుకున్న హీరో ఎవరో తెలుసా.. మళ్లీ సినిమా చేయాలంటూ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటుల్లో ఒకరైన సునీల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చాలా సంవత్సరాల పాటు కమెడియన్‌గా కొనసాగిన ఆయన తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అనంతరం కొంతకాలం హీరోగానూ కొనసాగారు. అయితే హీరోగా నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం ఆశించిన విజయాలు అందుకోకపోవడంతో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. ప్రస్తుతం సునీల్ సినిమాల్లో విలన్, కీలక పాత్రలు పోషిస్తూ తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ‘పుష్ప’ సినిమాతో ఆయనకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఈ మూవీ తర్వాత ఇతర భాషల సినిమాల్లో కూడా అవకాశాలు రావడం ప్రారంభమైంది.

తాజాగా ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న సునీల్‌కు “మళ్లీ మళ్లీ వర్క్ చేయాలని అనిపించే తెలుగు హీరో ఎవరు?” అనే ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందించిన ఆయన.. నేను చిరంజీవి గారితో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి డాన్స్ చేయాలనిపించేది. ఆయననే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చాను. చిన్న వయసులో ఆయన సినిమా టికెట్లు కోసం ఎంతో కష్టపడేవాడిని. స్క్రీన్‌పై ఆయనను చూసి చాలా ఆనందించేవాడిని. అలాంటి ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా అనిపించింది. మళ్లీ మళ్లీ కూడా ఆయనతో నటించాలని ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సునీల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story