ఆ స్టార్ హీరో అంటే చాలా ఇష్టం.. ఆయనతో పనిచేయాలని ఉంది.. మానస వారణాసి

by Pulgam srinivas |

తాజాగా మానస వారణాసి మాట్లాడుతూ... నేను చిన్న వయసు నుండి మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున సినిమాలు చూస్తూ పెరిగాను. ముఖ్యంగా మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. ఆయనతో సినిమా అవకాశం వస్తే బాగుంటుందని ఆమె చెప్పుకొచ్చింది.

ఆ స్టార్ హీరో అంటే చాలా ఇష్టం.. ఆయనతో పనిచేయాలని ఉంది.. మానస వారణాసి
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ యువ నటుడు అశోక్ గల్లా ప్రధాన పాత్రలో రూపొందిన దేవకి నందన వాసుదేవా అనే చిత్రంతో మానస వారణాసి తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్ద స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేదు. దానితో ఈ బ్యూటీకి ఈ మూవీ ద్వారా పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఈ సినిమా తర్వాత ఈమెకు కాస్త ఎక్కువగానే గ్యాప్ వచ్చింది. తాజాగా ఈమె సంతోష్ శోభన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కపుల్ ఫ్రెండ్లీ చిత్రంలో హీరోయిన్గా నటించింది.

తాజాగా విడుదల అయిన ఈ సినిమాకు మంచి టాక్ రావడం జరిగింది. ఈ చిత్రంలో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం వల్ల ఒక్కసారిగా మానసకి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం కపుల్ ఫ్రెండ్లీకి మంచి ప్రేక్షకాదరణ దక్కుతుండడంతో ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తుంది. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో ఈమెకు తెలుగు సినిమా పరిశ్రమలో ఏ నటులు అంటే ఇష్టం? ఎవరితో సినిమా చేయాలని ఉంది అనే విషయాలను తెలియజేసింది.

తాజాగా మానస వారణాసి మాట్లాడుతూ... నేను చిన్న వయసు నుండి టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ సినిమాలు చూస్తూ పెరిగాను. వారి నటన చాలా ఇష్టం. వారిపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఇక నాకు మహేష్ బాబు గారు అంటే చాలా చాలా ఇష్టం. ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే బాగుంటుందని అనుకుంటున్నట్లు ఈమె తాజాగా చెప్పుకొచ్చింది.

Next Story