- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Peddi : ఫైనల్ రన్ టైం టార్గెట్ అదే.. పెద్ది 'పెద్ద' సినిమానే?
Peddi : పెద్ది సినిమా దాదాపు 3 నుండి 3 గంటల 10 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్ : గత కొద్ది కాలంగా స్టార్ హీరోల సినిమాలు చాలా వరకు భారీ రన్ టైంతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలా వచ్చిన వాటిలో అనేక చిత్రాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. దాంతో ఫలానా స్టార్ హీరో ఒక సినిమాలో నటిస్తున్నాడు అంటే ఆ మూవీ రన్ టైం దాదాపు 3 గంటల వరకు ఉంటుంది అని సగటు ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న చిత్రాలలో పెద్ది ఒకటి.
ఇందులో బాలీవుడ్ నటి, జాన్వి కపూర్ హీరోయిన్గా కనిపించనుండగా, బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల వారు నిర్మిస్తున్నారు. దివ్యాంధు, శివ రాజ్ కుమార్, జగపతిబాబు తదితరులు ఇందులో ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 30వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా రన్ టైంకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది.
దాని ప్రకారం ఈ చిత్రం 3 నుండి 3 గంటల 10 నిమిషాల వరకు నిడివితో వచ్చే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందుతుంది. అలాగే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ ఆఫ్ లాక్ అయినట్టు, అందులో ఎలాంటి ఎడిటింగ్ ఉండే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఏమైనా కట్స్ ఉన్నా కూడా అవి సెకండ్ హాఫ్ లోనే ఉండే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇలా ఈ సినిమా 3 నుండి 3 గంటల 10 నిమిషాల రన్ టైంతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉండడంతో 'పెద్ది'ని చాలా పెద్ద సినిమా అని ప్రేక్షకులు భావిస్తున్నారు.






