- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మాయిల కలల రాకుమారుడు హీరో తరుణ్ ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..? షాక్ అవుతున్న నెటిజన్లు(పోస్ట్)
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మారి మంచి హిట్ సినిమాలను అందించిన హీరో తరుణ్(Tharun) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మారి మంచి హిట్ సినిమాలను అందించిన హీరో తరుణ్(Tharun) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆయన అప్పట్లో చేసిన దాదాపు అన్ని సినిమాలు క్లాసికల్ హిట్స్ అనే చెప్పాలి. ఇక ఇతని మూవీలోని సాంగ్స్‌కి అయితే సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన తరుణ్ (Tharun) సుమారు దశాబ్దంగా సినిమాల్లో కనిపించడం పూర్తిగా బంద్ చేశారు. కానీ తరుచూ ఎక్కడో అక్కడ వార్తల్లో వినిపిస్తూ, కనిపిస్తూ తన అభిమానులను పలకరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా తరుణ్ సోషల్ మీడియా(Social Media)లో పెట్టిన ఫొటోతో మరోసారి ట్రెండింగ్‌గా మారాడు.
ఇటీవల అమెరికా (USA) వెకేషన్‌కు వెళ్లిన మన టాలీవుడ్ హీరో లాస్ వేగాస్ (Las Vegas)లో సౌత్ కొరియా (South Korea) అగ్ర నటుడు డాన్ లీ (DonLee)ని కలిసి ఆయనతో ఫొటో దిగారు. ఆ చిత్రం కాస్త సామాజిక మాద్యమాల్లోకి చేరి ఇప్పుడుపెద్ద రచ్చే చేస్తుంది. ఆ ఫొటో చూసిన వాళ్లంతా అప్పట్లో చాలా క్యూట్‌గా ఉండే తరుణ్ ఇప్పుడు కొంచెం తెల్ల గడ్డంతో ఏజెడ్ పర్సన్‌లా కనిపించేసరికి షాక్ అవుతున్నారు. అలాగే మీరు మళ్లీ సినిమాలు చేయాలని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తరుణ్ ఫొటోను ఓ సారి చూసేయండి. Link






