- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమంత-రాజ్ పెళ్లి జరిగిన పద్ధతి ఏంటో తెలుసా?
స్టార్ నటి సమంత, ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడమోరు పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : స్టార్ నటి సమంత, ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడమోరు పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కోయంబత్తూరులోని ఈషా సెంటర్ లో ఉంగరాలు మార్చుకున్న ఫోటోలు ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే వీరు ఇద్దరు చేసుకున్న పెళ్లి విధానంపై కూడా సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. వీరు ఇద్దరూ 'భూత శుద్ధి వివాహం' ద్వారా ఒక్కటిగా.. ఈ వివాహ ప్రక్రియ గురించి, నెట్టింట్లో విపరీతంగా వెతుకుతున్నారు. ఆలోచనలు, భావోద్వేగాలకు, భౌతిక విషయాలకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరిచే విచిత్ర ప్రక్రియనే భూత శుద్ధి వివాహం అంటారు. లింగ భైరవి ఆలయాల్లో, లేదా ఎంపిక చేసిన కొన్ని ప్రత్యేక ఆలయాల్లో మాత్రమే ఇలాంటి విశిష్టమైన క్రతువు చేస్తారు.
అన్ని ఆలయాల్లో ఇలాంటి పెళ్లిళ్లు జరగవు. భూత శుద్ధి వివాహం ద్వారా దంపతుల మధ్య సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మిక వంటి అంశాలు పెంపొంది, వివాదాలకు దూరంగా శాంతియుత జీవనం సాగిస్తారని నమ్ముతారు. సమంత-రాజ్ వివాహం కోయంబత్తూరులోని ఈషా కేంద్రంలో స్వయంగా సద్గురు చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట జరిపిన లింగ భైరవి దేవి గుడిలో జరిగింది. కాగా సమంత వివాహం ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెన్సేషనల్ అవగా.. ఈ వివాహంతో అయినా ఆమె జీవితం ప్రశాంతంగా సాగాలని కోరుకుంటున్నారు ఆమె అభిమానులు.






