- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్ ఫైనల్స్ సందర్భంగా అనుష్క శర్మ ధరించిన వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?
ఐపీఎల్ 2026 ఫైనల్ సందర్భంగా అనుష్క శర్మ ధరించిన కార్టియర్ ‘పాంథెర్’ వాచ్ అందరి దృష్టిని ఆకర్షించగా, దాని ధర సుమారు రూ.28 లక్షలు అని సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: 2026 ఐపీఎల్ సీజన్ మే 31తో ముగిసింది. ఈ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘన విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. గత ఏడాది తొలిసారి టైటిల్ గెలుచుకున్న ఈ జట్టు, ఈసారి కూడా విజయం సాధించి అభిమానులను మరింత ఆనందంలో ముంచెత్తింది. ఇక ఫైనల్ మ్యాచ్ సందర్భంగా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా జట్టును ప్రోత్సహించేందుకు మైదానానికి వచ్చింది. ఈ మ్యాచ్ కోసం అనుష్క వైట్ కలర్ టీషర్ట్, బ్లూ జీన్స్‌లో స్టైలిష్‌గా కనిపించింది. అయితే ఆమె దుస్తుల కంటే ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించింది ఆమె చేతికి ధరించిన లగ్జరీ వాచ్.
ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అనుష్క శర్మ ధరించిన వాచ్ ప్రముఖ లగ్జరీ బ్రాండ్ కార్టియర్‌కు చెందిన ‘పాంథెర్’ మోడల్‌దిగా తెలుస్తోంది. ఈ వాచ్ విలువ సుమారు రూ.28 లక్షలు ఉండొచ్చని సమాచారం. దీంతో ఈ వాచ్ ఖరీదు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కొందరు ఈ స్థాయి ధర చూసి ఆశ్చర్యపోతుండగా, మరికొందరు మాత్రం అనుష్క స్థాయికి తగ్గట్టే ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇక తన భర్త విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగళూరు జట్టు వరుసగా రెండోసారి టైటిల్ గెలవడంతో అనుష్క శర్మ మైదానంలోనే ఆనందం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






