శ్రీలీల నిమిషానికి ఎంత తీసుకుంటుందో తెలుసా..? సామాన్యుడు లైఫ్‌‌లో సెట్ కావచ్చు!?

by Bhoopathi Nagaiah |

శ్రీలీల. ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోతుంది. ఏ హీరో పక్కన చూసినా ఆమె కనిపిస్తోంది.

శ్రీలీల నిమిషానికి ఎంత తీసుకుంటుందో తెలుసా..? సామాన్యుడు లైఫ్‌‌లో సెట్ కావచ్చు!?
X

దిశ, వెబ్‌డెస్క్ : శ్రీలీల. ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోతుంది. ఏ హీరో పక్కన చూసినా ఆమె కనిపిస్తోంది. ఖర్చు ఎంతైనా పర్వాలేదు.. ఆమె తమ పక్కన ఉండాల్సిందే అని హీరోలు పట్టుబడుతున్నారట. ఇటీవల ఓ హీరో తన రెమ్యూనరేషన్ తగ్గించుకోని మరీ ఆమెను తన సినిమాలోకి తీసుకున్నాడట. హీరోలకు అంతలా పిచ్చెక్కిస్తోంది శ్రీలీల. ఇక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను అక్షరాల పాటిస్తున్న ఈ బ్యూటీ.. తన పారితోషికాన్ని కూడా అమాంతం పెంచేసిందంట. తన మొదటి సినిమా ‘పెళ్లి సందD’కి కేవలం రూ.5 లక్షలు తీసుకున్న ఈ భామ.. ప్రస్తుతం రూ.8కోట్లకు ఎగబాకిందంట.

ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాల్లో నటిస్తున్న శ్రీలీల.. ధమాక మూవీకి రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, నితిన్ తదితర హీరోల పక్కన నటిస్తుండగా ఆ మూవీలకు రూ.5 నుంచి 8 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది. ఇక ఇవే కాక షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, వాణిజ్య ప్రకటనలకు భారీగానే ఛార్జ్ చేస్తుందట.

షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు కోటి రూపాయలు తీసుకుంటుండగా.. ఫ్లైట్ టికెట్స్, ఇతర ఖర్చులు సైతం షాప్ ఓనరే భరించాలట. అది కూడా నిమిషానికి రూ.10 లక్షల చొప్పున లెక్కకట్టి కేవలం 10 నిమిషాలకు ఎక్కువ సేపు ఉండదట. అంతకంటే సమయం మించితే దానికి కూడా ఛార్జ్ వేస్తుందట. ప్రస్తుతం టాలీవుట్‌లో ఇంత రెమ్యూనరేషన్ ఏ హీరోయిన్‌కు ఇవ్వడం లేదట. గతంలో సమంత, పూజ హెగ్డే, రశ్మిక మందనాకు మాత్రమే అంతగా చెల్లించారట. ప్రస్తుతం ఆ లిస్ట్‌లో శ్రీలీల చేరిపోయిందట.

Next Story