ఫిష్ వెంకట్ ఒక్క రోజుకి తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? అస్సలు ఊహించి ఉండలేరుగా..

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

ఫిష్ వెంకట్ ఒక్క రోజుకి తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? అస్సలు ఊహించి ఉండలేరుగా..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో కామెడీ, సీరియస్ విలన్ పాత్రల్లో నటించి మెప్పించాడు. అలా వందకు పైగా చిత్రాల్లో నటించి సినీ ప్రియులను అలరించారు. ఆది, దిల్‌, బన్నీ, అత్తారింటికి దారేది, లక్ష్మీ, చెన్నకేశవరెడ్డి, గబ్బర్‌సింగ్‌, డీజే టిల్లు, కింగ్‌, డాన్‌ శీను, మిరపకాయ్‌, దరువు, సుప్రీమ్‌ తదితర హిట్‌ చిత్రాల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చివరి చిత్రం ‘కాఫీ విత్‌ ఏ కిల్లర్‌’. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే షుగర్ కారణంగా కాళ్లుదెబ్బతినడం, కిడ్నీలసమస్యలతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఆరోగ్యం బాగుపడి రీఎంట్రీ అనుకునేలోపే పరిస్థితి విషమించి శుక్రవారం తుది శ్వాస విడిచారు.

ఇక రెండు కిడ్నీలు డ్యామేజ్‌ కావడంతో డయాలసిస్‌ కోసం కొన్ని రోజుల క్రితం బోడుప్పల్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. అయితే.. రెండు కిడ్నీలు మార్పిడి చేయాలని వైద్యులు చెప్పినట్లు ఆయన కుమార్తె ఇటీవల తెలిపారు. వైద్య సేవలు పొందలేని దీన స్థితిలో ఉన్నామని, దాతలు ఎవరైనా సాయం చేయాలని వేడుకున్న కొద్దిరోజులకే ఫిష్‌ వెంకట్‌ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గామారింది. ఫిష్ వెంకట్ 100 పైగా సినిమాల్లో తన నటనతో మెప్పించిన ఆయన రోజుకు రూ 30 వేలు రెమ్యూనరేషన్ తీసుకునేవారని సన్నిహితులు తెలిపారు. అంత మనీ తీసుకున్నప్పటికీ డబ్బులు కూడా పెట్టుకో లేకపోవడంతో ఆయన పరిస్థితి అలా అయిందని తెలిపారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story