దిల్ రాజు డ్రీమ్స్: టార్గెట్ పెద్దదే.. కానీ ఓకే అయినవి అవి మాత్రమే

by Pulgam srinivas |

తాజాగా దిల్ రాజు మాట్లాడుతూ... ఇప్పటివరకు మా DRD సంస్థకు 330 కథలు వచ్చాయి. అందులో 100 విని, ఐదింటిని ఓకే చేశాం. ప్రతి సంవత్సరం మా సంస్థ నుండి 5, 6 సినిమాలు వచ్చేలా పనిచేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చాడు.

దిల్ రాజు డ్రీమ్స్: టార్గెట్ పెద్దదే.. కానీ ఓకే అయినవి అవి మాత్రమే
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు కొంత కాలం క్రితం DRD (దిల్ రాజు డ్రీమ్స్) అనే పేరుతో ఓ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేయడం, కొత్త దర్శకులను, నటీనటులను, సాంకేతిక నిపుణులను తీసుకొని సినిమాలను రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం. ఇలా చేయడం వల్ల కొత్త టాలెంట్ బయటికి వస్తుంది. దాని ద్వారా సినిమా ఇండస్ట్రీ కూడా అభివృద్ధి చెందుతుంది అని దిల్ రాజు ప్రకటించాడు.

దిల్ రాజు 'DRD' సంస్థను 7, 8 నెలల క్రితం ప్రకటించాడు. ఇప్పటికే ఈ సంస్థ పెద్ద ఎత్తున పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. తాజాగా దిల్ రాజు ఇప్పటివరకు దిల్ రాజు డ్రీమ్స్ సంస్థకు దాదాపు 330 కథలు వచ్చాయని, అందులో 100 కథలను సెలెక్ట్ చేసి చూశామని, అందులో నుండి ఫైనల్ గా ఐదింటిని ఓకే చేశామని, ప్రతి సంవత్సరం కనీసం ఐదారు సినిమాలు దిల్ రాజు డ్రీమ్స్ సంస్థ నుండి రావాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున పనులు చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. దిల్ రాజు 'దిల్' సినిమాతో నిర్మాతగా కెరియర్ను ప్రారంభించాడు.

ఆ తర్వాత ఆయన ఎంతోమంది కొత్త దర్శకులకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఛాన్స్ ఇచ్చాడు. ఈయన బ్యానర్ నుండి వెండితెరకు పరిచయం అయిన అనేకమంది ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలా ఎంతో గొప్ప ఖ్యాతి కలిగిన దిల్ రాజు DRD పేరుతో ఓ సంస్థను నెలకొల్పి కొత్త వాళ్లకు ఛాన్స్ ఇస్తానని చెప్పడంతో అనేకమంది ఈ బ్యానర్ నుండి ఇండస్ట్రీకి పరిచయం కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

Next Story