- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగ్గురు నిర్మాతలు.. ఒక హీరో.. బోయపాటికి అసలైన పరీక్ష
బోయపాటితో సినిమా చేయడానికి ముగ్గురు నిర్మాతలు, జూనియర్ మూవీ హీరో కిరీటి రెడ్డి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది

దిశ, వెబ్ డెస్క్ : ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉన్న దర్శకుడైన సరే వరుసగా ఓ రెండు ఫ్లాప్స్ అందుకున్నట్లయితే కెరియర్ ఒక్కసారిగా పడిపోతుంది. ఆ తర్వాత ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు కూడా పెద్దగా ముందుకు రారు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ క్రేజ్ ఉన్న దర్శకుడు వరుసగా రెండు సినిమాలతో అపజయాలను సొంతం చేసుకున్నాడు. దాంతో ఆయనతో సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రారు అని చాలామంది భావించారు. కానీ ఆ దర్శకుడి చుట్టూ ఏకంగా ముగ్గురు నిర్మాతలు, ఒక హీరో సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందుతుంది.
ఇంతకు ఆ దర్శకుడు ఎవరు అనుకుంటున్నారా..? ఆయన మరెవరో కాదు టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరైన బోయపాటి శ్రీను. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి అందులో చాలా మూవీలతో మంచి సక్సెస్లను అందుకున్నాడు. బోయపాటికి ఆఖరిగా అఖండతో విజయం దక్కింది. ఈ చిత్రం తర్వాత ఈయన 'రామ్'తో స్కంద చిత్రాన్ని రూపొందించాడు. ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఆఖండ మూవీకి కొనసాగింపుగా 'అఖండ 2'ను తెరకెక్కించాడు.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా బోయపాటితో సినిమా చేయడానికి ముగ్గురు నిర్మాతలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక జూనియర్ హీరో కిరీటి రెడ్డి కూడా బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి బోయపాటి నెక్స్ట్ ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళతాడు అనేది చాలామందిలో ఆసక్తిగా మారింది.






