లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్.. 9 నంది అవార్డులు.. టాలీవుడ్‌లోనే సూపర్ రికార్డ్

by Pulgam srinivas |

అంతఃపురం సినిమాకు... నంది స్పెషల్ జ్యూరీ అవార్డు: సౌందర్య, ఉత్తమ సహాయ నటుడు: జగపతి బాబు, ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్: ప్రకాష్ రాజ్, ఉత్తమ మహిళా నేపథ్య గాయని: ఎస్. జానకి, ఉత్తమ దర్శకుడు: కృష్ణవంశీ, ఉత్తమ చిత్రం, కళాత్మక చిత్రం కలిపి వివిధ విభాగాల్లో మొత్తంగా 9 నుండి 11 వరకు అవార్డులు దక్కాయి.

లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్.. 9 నంది అవార్డులు.. టాలీవుడ్‌లోనే సూపర్ రికార్డ్
X

దిశ, వెబ్ డెస్క్ : సినిమా ఇండస్ట్రీలో కొన్ని మూవీలు పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయ్యి మంచి విజయాలను సాధించడమే కాకుండా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని ఎన్నో అవార్డులను కూడా అందుకున్నాయి. అలా తెలుగు సినిమా పరిశ్రమలో ఏకంగా తొమ్మిది వరకు నంది అవార్డులను అందుకున్న ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా ఉంది... అదేదో అనుకుంటున్నారా? అదే అంతఃపురం. తెలుగు సినీ పరిశ్రమలో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరైన కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి కుమార్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించారు.

కానీ ఈ సినిమా ప్రారంభమైన కొంత సమయానికే సాయి కుమార్ పాత్ర చనిపోతుంది. దాంతో సౌందర్య పాత్రతోనే ఈ సినిమా ముందుకు సాగుతుంది. ఈ మూవీలోని సాయి కుమార్ సౌందర్య నటనకు ప్రేక్షకుల, విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటించగా, జగపతిబాబు సహాయ నటుడిగా నటించాడు. వీరిద్దరూ కూడా ఈ సినిమాలో తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇక ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఆయన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో కీలకపాత్రను పోషించింది.

ఇలా ఎంతోమంది ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం అద్భుతమైన రీతిలో పనితనాన్ని చూపించారు. దాంతో ఈ సినిమాకు ఎన్నో నంది అవార్డులు దక్కాయి. నంది స్పెషల్ జ్యూరీ అవార్డు: సౌందర్య, ఉత్తమ సహాయ నటుడు: జగపతి బాబు, ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్: ప్రకాష్ రాజ్, ఉత్తమ మహిళా నేపథ్య గాయని: ఎస్. జానకి (సూరీడు పువ్వా పాటకు), ఉత్తమ దర్శకుడు: కృష్ణవంశీ, ఉత్తమ చిత్రం, కళాత్మక చిత్రం కలిపి వివిధ విభాగాల్లో మొత్తంగా 9 నుండి 11 వరకు అవార్డులు దక్కాయి.

Next Story