- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Skin Secret: సాయిపల్లవి రోజుకు ఎన్ని లీటర్ల కొబ్బరి వాటర్ తాగుతుందో తెలుసా?
టాలీవుడ్ హీరోయిన్ సాయిపల్లవి (Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ సాయిపల్లవి (Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. నేచురల్ బ్యూటీగా బ్యూటీ పేరు సంపాదించుకుంది. యూత్‌లో సాయి పల్లవి ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం సాయి పల్లవి స్టార్ హీరోల సరసన అవకాశాలు కొట్టేసి.. పాన్ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
ప్రేమమ్ (Premam) మూవీతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసింది. ముఖ్యంగా డ్యాన్స్‌తో జనాలందరినీ మెస్మరైజ్ చేసిందనడంలో అతిశయోక్తిలేదు. తర్వాత దుల్కర్ సల్మాన్‌తో కాళఇ మూవీలో నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ చిత్రాన్ని హే పిల్లగాడా పేరుతో డబ్ చేశారు. ఇలా.. దర్శకుడు శేఖర్ కమ్ముల(Shekhar Kammula) దర్శకత్వంలో ఫిదా సినిమాలో నటించే అవకాశం వచ్చింది.
తర్వాత శ్యామ్ సింగ రాయ్(Shyam Singh Roy), లవ్ స్టోరీ(love story), నేను లోకల్(Nenu lokal), రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అమరన్ (Amaran).. తండేల్ (Tandel) మూవీ ఇలా పలు చిత్రాల్లో నటించి పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు సంపాదించుకుంటుంది. అయితే తండేల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో చాలా మంది ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సాయి పల్లవి స్కిన్ సీక్రెట్ అడగ్గా.. నేచురల్ బ్యూటీ ఇలా సమాధానమిచ్చింది. ఇంటర్వ్యూలో సాయిపల్లవిని హెల్త్ అండ్ ఫేస్ గ్లోకు ఎంటి సీక్రెట్ అని అడగ్గా.. ప్రతీ రోజు మూడు లీటర్ల కొబ్బరి వాటర్ తాగుతానని వెల్లడించింది. అలాగే పెరుగు కూడా తాగుతానని తెలిపింది. ప్రస్తుతం ఈ నేచురల్ బ్యూటీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






