15 కోట్ల బడ్జెట్.. 905 కోట్ల కలెక్షన్స్.. 18 ఏళ్లకే రిటైర్మెంట్.. ముద్దుగుమ్మ జీవితంలో ఎన్ని మలుపులో

by Pulgam srinivas |   (  Updated:2026-02-16 06:44:49  IST  )

అమీర్ ఖాన్ కీలక పాత్రలో నటించి నిర్మించిన సీక్రెట్ సూపర్ స్టార్ మూవీ 15 కోట్ల బడ్జెట్‍తో రూపొంది ప్రపంచవ్యాప్తంగా 905 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. జైరా వసీం ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది.

15 కోట్ల బడ్జెట్.. 905 కోట్ల కలెక్షన్స్..  18 ఏళ్లకే రిటైర్మెంట్.. ముద్దుగుమ్మ జీవితంలో ఎన్ని మలుపులో
X

దిశ, వెబ్ డెస్క్ : సినిమా కథలో బలం ఉండి దాన్ని తెరపై అదే స్థాయిలో తెరకెక్కించినట్లయితే తక్కువ ఖర్చుతో కూడా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించవచ్చు. ఇప్పటివరకు ఇండియా వ్యాప్తంగా ఎన్నో సినిమాలు తక్కువ బడ్జెట్ తో రూపొంది అద్భుతమైన వసూళ్లను రాబట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఓ సినిమా కేవలం 15 కోట్ల బడ్జెట్ తో రూపొంది ఏకంగా 905 కోట్ల కలెక్షన్లను రాబట్టి ఇండియన్ సినీ హిస్టరీలోనే ఒక గొప్ప అధ్యాయాన్ని సృష్టించింది. ఇంతకు ఆ సినిమా ఏది అనుకుంటున్నారా? ఆ మూవీ మరేదో కాదు అమీర్ ఖాన్ నిర్మించి అందులో కీలకపాత్రలో నటించిన సీక్రెట్ సూపర్ స్టార్.

ఈ సినిమా 2017లో విడుదలైంది. జైరా వసీం ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా సమయంలో ఈమె వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. అద్వైత్ చందన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ కేవలం 15 కోట్ల బడ్జెట్లోనే రూపొందించాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 905 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఓ టీనేజ్ అమ్మాయి గాయని కావాలనుకుంటుంది. కానీ ఇంట్లో పరిస్థితుల కారణంగా ఆమె గాయని కావడానికి అనుకూలమైన పరిస్థితులు ఉండవు.

దానితో ఆమెకు ఉన్న అవకాశాలతో పాటలను చిత్రీకరించి యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ వీడియోలలో ఆమె తన మొహాన్ని దాచుకుంటుంది. అలా ఆమె మంచి క్రేజ్ను సంపాదించుకుంటుంది. చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఇండియాలో 65 కోట్ల కలెక్షన్లను వసూలు చేయగా, చైనాలో 750 కోట్లు, హాంకాంగ్ నుండి 65 కోట్లు రాబట్టింది. జైరా వసీం 18 సంవత్సరాల వయసులో సినిమాల నుండి తప్పుకుంది. ఆఖరుగా ఈమె 'ది స్కై ఈజ్ పింక్' అనే చిత్రంలో నటించింది.

Next Story