- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Geetu Mohandas : టాక్సిక్ డైరెక్టర్.. తెలుగులో చేసిన సినిమా ఏదో తెలుసా?
Geetu Mohandas : టాక్సిక్ మూవీ దర్శకురాలు గీతూ మోహన్ దాస్, తెలుగులో వేణు తొట్టెంపూడి హీరోగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన వీడెక్కడి మొగుడండీ చిత్రంలో రెండవ హీరోయిన్‍గా నటించింది

దిశ, వెబ్ డెస్క్ : కన్నడ స్టార్ యాష్ హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్ మూవీకి మహిళా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. యష్ లాంటి స్టార్ హీరో సినిమాకు దర్శకత్వం వహించడంతో గీతూ మోహన్ దాస్ గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
గీతూ మోహన్ దాస్ కేరళలో జన్మించారు. చిన్న వయసులోనే ఈమె మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. బాలనటిగా చాలా సినిమాల్లో నటించారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ నటి తెలుగులో కూడా ఒక సినిమాలో నటించారు. తెలుగులో ఈమె నటించిన సినిమా ఏది అనుకుంటున్నారా? 2001లో వేణు తొట్టెంపూడి హీరోగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన వీడెక్కడి మొగుడండీలో ఈమె రెండవ హీరోయిన్గా నటించారు. నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాక ఈమె దర్శకత్వం వైపు అడుగులు వేశారు.
అందులో భాగంగా లయర్స్ డైస్ అనే చిత్రం ద్వారా దర్శకురాలిగా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 2013లో విడుదల అయిన ఈ చిత్రానికి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాతో ఈమెకు దర్శకురాలుగా మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత ఈమె మూతోన్ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా ఈమె యాష్ హీరోగా టాక్సిక్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం గనుక మంచి విజయం సాధిస్తే ఇండియా వ్యాప్తంగా ఈ దర్శకురాలికి స్టార్ డైరెక్టర్గా క్రేజ్ దక్కే అవకాశం ఉంది. మరి టాక్సిక్ చిత్రంతో ఈమెకు ఏ స్థాయి విజయం, గుర్తింపు దక్కుతుందో చూడాలి.






