ఓటీటీలో రికార్డ్ సృష్టించిన D/O ప్రసాద్ రావు

by Pulgam srinivas |

D/O ప్రసాద్ రావు కనబడుటలేదు వెబ్ సిరీస్‌కు వారం రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మీనిట్స్ దక్కినట్లు జీ5 ఓటీటీ సంస్థ వారు తాజాగా ప్రకటించారు.

ఓటీటీలో రికార్డ్ సృష్టించిన D/O ప్రసాద్ రావు
X

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్యకాలంలో క్రైమ్ సిరీస్‌లకి మంచి ప్రేక్షకాదరణ దక్కుతుంది. దానితో ఓటీటీ సంస్థలు కూడా ఎక్కువ శాతం క్రైమ్ సిరీస్ కంటెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. తాజాగా జీ5 ఓటీటీ సంస్థ వారు D/O ప్రసాద్ రావు కనబడుటలేదు అనే వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సిరీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందింది. ఇందులో రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, గాయత్రి భార్గవి తదితరులు నటించారు.

కృష్ణ పోలూరు దర్శకత్వంలో తెరకెక్కినఈ సిరీస్ ఫిబ్రవరి 27వ తేదీ నుండి అందుబాటులోకి వచ్చింది. ఈ వెబ్ సిరీస్‌కి మంచి టాక్ రావడంతో ఇది అద్భుతమైన వ్యూస్‌ను సొంతం చేసుకుంటూ వెళుతుంది. తాజాగా జీ5 సంస్థ వారు వారం రోజుల్లోనే 'D/O ప్రసాద్ రావు కనబడుటలేదు' వెబ్ సిరీస్‌కు 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. తక్కువ రోజుల్లోనే దీనికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

ఈ సిరీస్ కథ విషయానికి వస్తే... రాజీవ్ కనకాలకి తన కూతురు అంటే చాలా ఇష్టం. సొంత ఊరిలో ఉన్న తన కూతురికి హైదరాబాద్‌లో ఉద్యోగం వస్తుంది. కానీ ఆయనకు అక్కడికి పంపడం ఇష్టం లేదు. కానీ చివరకు అందరినీ ఒప్పించి హైదరాబాదులో ఒక హాస్టల్లో ఉంటూ జాబ్ చేసుకుంటుంది. ఒకరోజు ఆ అమ్మాయి కనిపించకుండా పోతుంది. దానితో ఉదయభాను ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆ తర్వాత ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగింది, అసలు రాజీవ్ కనకాల కూతురు దొరికిందా లేదా? ఆమెకి ఏమైంది అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.




Next Story