- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆవేశంతో సోషల్ మీడియాలో స్పందించకండి కాస్త సమయమివ్వండి.. విజయ్‌కి మద్దతుగా లారెన్స్ పోస్ట్
నా ఆప్తమిత్రుడు సీఎం జోసెఫ్ విజయ్ గారు కచ్చితంగా ఎంతో జాగ్రత్తగా, భవిష్యత్తును ఆలోచించి మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను.

దిశ, సినిమా: దళపతి విజయ్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సీఎం అయిన ఆయన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించి శాఖలను కేటాయించారు. అయితే పలువురు మంత్రులకు కేటాయించిన శాఖలపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఫిల్మ్ టెక్నాలజీ సినిమాటోగ్రాఫ్ చట్టం మినిస్టర్‌గా రాజ్ మోహన్‌ను నియమించడంపై నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి. అనుభవం లేని వ్యక్తికి ఆ శాఖను కేటాయించడంపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాఘవ లారెన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ విజయ్ నిర్ణయాన్ని సమర్థించారు. "మన గౌరవ ముఖ్యమంత్రి, నా ఆప్తమిత్రుడు సీఎం జోసెఫ్ విజయ్ గారు కచ్చితంగా ఎంతో జాగ్రత్తగా, భవిష్యత్తును ఆలోచించి మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను. దయచేసి ఎవరూ ఆవేశంతో సోషల్ మీడియాలో నెగెటివ్ బజ్ క్రియేట్ చేయకండి, కాస్త సమయం ఇవ్వండి" అంటూ లారెన్స్ నెటిజన్లను కోరారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రి రాజ్ మోహన్ గురించి మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమ సంక్షేమం కోసం, సినిమా రంగం బాగుండటం కోసం ఆయన తన వంతు ఉత్తమ కృషి చేస్తారనే నమ్మకం తనకు ఉందని లారెన్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. విజయ్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం వెనుక ఏదో ఒక బలమైన వ్యూహం ఉంటుందని, కాబట్టి ఎలాంటి తొందరపాటు విమర్శలు చేయకుండా కొత్త ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.






