Comic Poster: డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ కొత్త సినిమా.. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

by Ramesh Naini |

2022లో కామెడీ హిట్ (DJ Tillu) డీజే టిల్లూతో దర్శకుడిగా పరిచయమైన విమల్ కృష్ణ మళ్లీ కొత్త ప్రయత్నంతో రాబోతున్నారు.

Comic Poster: డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ కొత్త సినిమా.. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో: 2022లో కామెడీ హిట్ (DJ Tillu) డీజే టిల్లూతో టాలీవుడ్ దర్శకుడిగా పరిచయమైన (Vimal Krishna) విమల్ కృష్ణ మళ్లీ కొత్త ప్రయత్నంతో రాబోతున్నారు. తన ప్రత్యేకమైన కథనంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఆయన, ఈ సారి రాగ్ మయూర్ హీరోగా, మెరిన్ ఫిలిప్ హీరోయిన్‌గా నటించే “అనుమానపక్షి” సినిమాను రూపొందిస్తున్నారు. చిలక ప్రొడక్షన్స్‌లో నిర్మిస్తున్న ఈ సినిమా ఆ ఒక్కటీ అడక్కు వంటి చిత్రాల తర్వాత ఈ బ్యానర్‌కి ఇది నాలుగో ప్రాజెక్ట్. నిర్మాతలు రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఇవాళ దసరా పండుగ సందర్భంగా విడుదల చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్ చూస్తే మరోసారి డిజే టిల్లు మాదిరి యూత్‌కి ఫుల్‌ఫన్ ఎంటర్‌టైనర్ దర్శకుడు అందించబోతున్నట్లు కన్పిస్తోంది. ఫస్ట్ లుక్‌ను కామిక్ బుక్ స్టైల్‌లో రూపొందించారు. కలర్ఫుల్ థాట్ బబుల్స్, ఫన్నీ ప్రశ్నలు, మజా వాతావరణంతో ఈ పోస్టర్ ఆకర్షణీయంగా ఉంది. “అనుమానపక్షి” త్వరలో థియేట్రికల్ రిలీజ్ కానుంది.

చిత్రంలో నటీనటులు: రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సిసిల్, అనన్యా, చారిత్, బ్రహ్మాజీ, సుప్రీత్

టెక్నికల్ టీమ్:

రచన & దర్శకత్వం: విమల్ కృష్ణ

నిర్మాతలు: రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దంద్

సహ నిర్మాత: భరత్ లక్ష్మీపతి

సంగీతం: శ్రీచరణ్ పాకాల

డీఓపీ: సునీల్ కుమార్ నామా

ఎడిటర్: అభినవ్ కూనపరెడ్డి

ఆర్ట్ డైరెక్టర్: జేకే మూర్తి

కాస్ట్యూమ్ డిజైనర్: సుమయ్యా తబస్సుమ్

Next Story