- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీజే టిల్లు దర్శకుడు నెక్ట్స్ మూవీ స్టార్ట్.. హీరో ఎవరంటే?
డీజే టిల్లుతో సంచలన విజయం అందుకున్న డైరెక్టర్ విమల్ కృష్ణ.. ఇప్పుడు తన తదుపరి మూవీకి సిద్ధం అయ్యాడు.

దిశ, సినిమా: డీజే టిల్లుతో సంచలన విజయం అందుకున్న డైరెక్టర్ విమల్ కృష్ణ.. ఇప్పుడు తన తదుపరి మూవీకి సిద్ధం అయ్యాడు. ఊహించని రేంజ్‌లో డీజే టిల్లు బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ హిట్ కొట్టడంతో డైరెక్టర్‌పై విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. ఇక వరుస సినిమాలతో దూసుకుపోతాడు అనుకుంటే సైలెంట్ అయిపోయాడు. టిల్లు వచ్చి మూడు ఏళ్లు గడుస్తున్న ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ విమల్ కృష్ణ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించి సర్‌ప్రైజ్ చేశాడు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ చిత్రం చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కబోతున్నది. ప్రొడక్షన్ నెం.4గా రూపొందబోతున్న ఈ మూవీలో ‘శివరపల్లి’ ఫేమ్ శ్యామ్, ప్రిన్స్ సిసిల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీనికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మరన్ని వివరాలు త్వరలో అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ప్రజెంట్ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Link






