పొట్టి బట్టలపై దివి షాకింగ్ కామెంట్స్.. ఏజ్‌లో కాకపోతే ఇంకెప్పుడు వేసుకుంటారంటూ సంచలనం

by I. Sairam |

బిగ్ బాస్ బ్యూటీ దివి వడ్త్యా(Divi Vadthya) మహేష్ బాబు(Mahesh Babu) నటించిన 'మహర్షి'(Maharshi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

పొట్టి బట్టలపై దివి షాకింగ్ కామెంట్స్.. ఏజ్‌లో కాకపోతే ఇంకెప్పుడు వేసుకుంటారంటూ సంచలనం
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ బ్యూటీ దివి వడ్త్యా(Divi Vadthya) మహేష్ బాబు(Mahesh Babu) నటించిన 'మహర్షి'(Maharshi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బిగ్‏బాస్(Bigg Boss) తెలుగు సీజన్ 4 ద్వారా బాగా గుర్తింపు పొందారు. అక్కడ తన గ్లామర్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేసింది. ఇక ఈ అమ్మడి అందానికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కూడా పడిపోయాడు కాబోలు తన నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇస్తానని మాటిచ్చేశాడు. మాట ఇచ్చినట్లే చిరు నటించిన ఓ సినిమాలో ఈ భామ కూడా యాక్ట్ చేసింది.

ప్రజెంట్ ఈ చిన్నది ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియా(social Media)లో కూడా ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ నిత్యం హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా జబర్దస్త్ వర్ష(Varsha) హోస్ట్ చేస్తున్న ‘కిస్సిక్ టాక్స్’(Kissik Talks) లేటెస్ట్ ఎపిసోడ్‌కి ఈ ముద్దుగుమ్మ గెస్టుగా వచ్చింది. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన అమ్మాయిల డ్రెస్సింగ్ వివాదం పైన షాకింగ్ కామెంట్స్ చేసింది.

డ్రెస్సింగ్ మీద కొన్ని కామెంట్లు వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది.. అని వర్ష అడుగగా.. అప్పుడు దివి స్పందిస్తూ.. ‘ఏజ్ ఉంది.. ఎప్పుడు వేసుకుంటారు స్కర్ట్‌లు, ఫ్రాక్‌లు, షార్ట్‌లు ఇంక.. వేసుకోండి.. రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు కదా’ అంటూ దివి బోల్డ్‌గా ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Next Story