- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బాస్ కంటెస్టెంట్‌తో పాన్ ఇండియా మూవీ
బిగ్ బాస్ దివి ముఖ్య పాత్రలో రాకీ షెర్మాన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కర్మస్థలం’. సామ్రాద్ని ఫిల్మ్స్, రాయ్ ఫిల్మ్స్ బ్యానర్లపై హర్ష వర్దన్ షిండే నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్.. అందరిలోనూ అంచనాల్ని పెంచేశారు. దివిని ఓ యోధురాలిగా చూపిస్తూ వదిలిన ఈ కొత్త పోస్టర్ ట్రేడ్ సర్కిళ్లలో

దిశ, సినిమా : బిగ్ బాస్ దివి ముఖ్య పాత్రలో రాకీ షెర్మాన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కర్మస్థలం’. సామ్రాద్ని ఫిల్మ్స్, రాయ్ ఫిల్మ్స్ బ్యానర్లపై హర్ష వర్దన్ షిండే నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్.. అందరిలోనూ అంచనాల్ని పెంచేశారు. దివిని ఓ యోధురాలిగా చూపిస్తూ వదిలిన ఈ కొత్త పోస్టర్ ట్రేడ్ సర్కిళ్లలో హైప్ పెంచేసింది. దివి కదనరంగంలో దూసుకుపోతున్నట్టుగా కనిపించడం, చుట్టూ అగ్ని జ్వాలలు, బ్యాక్ గ్రౌండ్‌లో యుద్ధం చేస్తున్న సైనికులు ఇలా ప్రతీ ఒక్క డీటైల్‌ను పోస్టర్‌లో అద్భుతంగా చూపించారు. ఈ చిత్రానికి విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ట్ వర్క్ ప్రధాన బలాలుగా నిలుస్తాయని మేకర్స్ చెప్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రానున్న ఈ చిత్రంలో అర్చనా శాస్త్రి, చుంకీ పాండే, అరవింద్ కృష్ణ, ప్రిన్స్ సెసిల్, దివి వాద్త్యా, కిల్లి క్రాంతి, మిథాలి చౌహాన్, కాలకేయ ప్రభాకర్, వెంకటేష్ ముమ్మిడి, వినోద్ అల్వా, బలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీకి శిరీష్ ప్రసాద్ ఎడిటర్‌గా, సాయి కార్తీక్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.






