- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Disha Patani: సైలెంట్ అయిపోయిన ప్రభాస్ హీరోయిన్.. అవకాశాలు రాకపోవడమే కారణమా?
బాలీవుడ్ (Bollywood) యంగ్ బ్యూటీ దిశా పటాని (Disha Patani) మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘లోఫర్’ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

దిశ, సినిమా: బాలీవుడ్ (Bollywood) యంగ్ బ్యూటీ దిశా పటాని (Disha Patani) మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘లోఫర్’ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ హిట్ కాకపోవడంతో మళ్లీ బాలీవుడ్‌కు చెక్కేసిన ఈ అమ్మడు తెలుగులో మాత్రం మరో సినిమా తీయలేదు. అయితే.. గతేడాది మాత్రం ‘కల్కి’(Kalki)తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ (Super success) అందుకుంది. కానీ దిశా పటానికి మాత్రం అనుకున్నంత క్రేజ్ ఇవ్వలేదు. తర్వాత ‘కంగువ’ (Kanguva) సినిమాలో కనిపించింది మెప్పించింది.
ప్రస్తుతం ‘వెల్ కమ్ టు ది జంగిల్’ (Welcome to the jungle) అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా తప్ప మరో చిత్రం అనౌన్స్ చేయలేదు. అయితే.. నిత్యం సోషల్ మీడియా(Social media)లో యాక్టివ్‌గా ఉంటూ తన అందాలతో ఫుల్ గ్లామర్ ట్రీట్ ఇస్తుంది దిశా. ట్రెండీ డ్రెస్సులు ధరిస్తూ యువతను ఆకట్టుకునే ఈ బ్యూటీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా సైలెంట్ అయిపోయింది. బ్యాక్ టు బ్యాక్ ఫొటో షూట్‌లతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసే దిశా.. కొద్ది రోజుల నుంచి తన గ్లామరస్ ఫొటోలు షేక్ చేయకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే.. కొంత మంది సినిమా అవకాశాలు రాకపోవడంతో సైలెంట్ అయిపోదంటూ కామెంట్స్ చేస్తున్నారు.






