- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్త్రీల విషయంలో వివక్ష ఇంకా కొనసాగుతోంది.. అసలు నిజాలు బయటపెడుతూ స్టార్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
శృతి హాసన్(Shruti Haasan) కోలీవుడ్ స్టా్ర్ హీరో కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ‘హే రామ్’ మూవీతో వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

దిశ, సినిమా: శృతి హాసన్(Shruti Haasan) కోలీవుడ్ స్టా్ర్ హీరో కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ‘హే రామ్’ మూవీతో వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ‘ఓమై ఫ్రెండ్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పవన్ కళ్యాణ్(Pawan Kalyan), రవితేజ, మహేష్ బాబు, రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్(Allu Arjun) వంటి స్టార్స్‌తో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక తమిళ ఇండస్ట్రీలో అజిత్ కుమార్, విజయ్, సూర్య చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇటీవల ఈ అమ్మడు ‘సలార్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం శృతి హాసన్ హాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుంది. డాఫ్నే ష్మోన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘ది ఐ’.
ఇదిలా ఉంటే.. తాజాగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ఆడవారు ఒకప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఇప్పటికి చాలా సమస్యలను ఎదుర్కొంటున్న ఆడవారు సమాజంలో చాలా మందే ఉన్నారు. నా తల్లి హీరోయిన్‌గా ఉన్న సమయంలో పడ్డ ఇబ్బందుల గురించి ఎన్నో సార్లు చెప్పింది. ఆమె నెలసరి సమయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంది. సినిమా ఇండస్ట్రీలో మహిళల హక్కులు ఎలా హరించారు అనే విషయాలను నా తల్లి సారికతో పాటు ఎంతో మంది సీనియర్ నటీమనులు చెప్పారు. సమానత్వంకు చాలా దూరంలో పరిస్థితులు ఉండేవి. మహిళలకు సెట్స్‌లోనే కాకుండా అన్ని చోట్లా చాలా తక్కువ ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇవ్వబడేది. రుతుస్రావం సమయంలో నిషిద్ద మనుషులుగా చూసేవారట. ఈ విషయాన్ని కూడా అమ్మ తనతో చాలా సార్లు చెప్పుకొచ్చింది. ఆ రోజుల్లో రుతుస్రావం గురించి కనీసం బయటకు చెప్పే పరిస్థితి ఉండేది కాదట.
ఆ విషయం గురించి మాట్లాడకుండా ఇబ్బందులు పడుతూనే షూటింగ్‌లో పాల్గొన్న సందర్భాలు చాలానే ఉండేవని వివరించింది. అప్పటి పరిస్థితులతో పోల్చితే ఇప్పుడు కాస్త మార్పు వచ్చింది. మహిళలు రుతుస్రావం గురించి బహిరంగంగా మాట్లాడే అవకాశం ఉంది. ఆ విషయంపై స్వేచ్చగా మాట్లాడే అవకాశంను నేటి తరం కల్పించారు. ఇప్పుడు ఆడవారు ఆరోగ్యం బాగాలేదు, షూటింగ్ లో పాల్గొనలేను అంటే అర్థం చేసుకుంటారు. ఆ విషయంలో కాస్త ఊరట కలిగినా ఇతర కొన్ని విషయాల్లో ఇప్పటికీ ఆడవారికి, మగవారికి మధ్య వ్యత్యాసం చాలా ఉంది. సమానత్వం అనేది సోషల్ మీడియాకే పరిమితం అయింది’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ శృతి హాసన్ కామెంట్స్ వైరల్ అవుతుండటంతో ఈ విషయం గురించి తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు.






