- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Disco Shanti: శ్రీహరి గారి వల్ల ఎంతోమంది బాగుపడ్డారు.. కానీ ఇప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు
డిస్కో శాంతి మాట్లాడుతూ.. “మా బావ శ్రీహరి బతికున్న సమయంలో ఎంతోమందికి మేలు చేశారు. కానీ ఆయన చనిపోయిన తర్వాత మమ్మల్ని ఒక్కరు కూడా పట్టించుకోలేదు” అని చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వారిలో శ్రీహరి ఒకరు. ఆయన తన కెరీర్‌ను అద్భుతమైన స్థాయిలో కొనసాగిస్తున్న సమయంలోనే అనుకోకుండా మరణించారు. ఇక ఆయన సతీమణి డిస్కో శాంతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని శ్రీహరి గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. డిస్కో శాంతి మాట్లాడుతూ.. “మా బావ శ్రీహరి గారు సినిమాలు చేస్తున్న సమయంలో ప్రతి రోజూ ఇంటికి ఎంతోమంది పేదవాళ్లు వచ్చేవారు. అలా వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన డబ్బులు ఇచ్చి, ఎంతో గౌరవంగా ఇంటి నుండి పంపించేవారు.
అలాగే చాలామందిని చదివించారు. అలా చదివించిన వారిలో ఇప్పుడు అనేక మంది మంచి స్థాయిలో ఉన్నారు. ఎంతోమందికి ఉద్యోగాలు కూడా ఇప్పించారు. కానీ మా బావ చనిపోయిన తర్వాత వారిలో ఒక్కరు కూడా మమ్మల్ని పలకరించలేదు. దాంతో నాకు మనుషుల స్వభావం ఇలానే ఉంటుందని అర్థమైంది. మేము ఇప్పుడు అన్ని రకాలుగా బాగున్నాం. మా బావ శ్రీహరి ఉన్న సమయంలో ఎలా ఉన్నామో, ఇప్పటికీ అలాగే ఉన్నాం” అని డిస్కో శాంతి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.






