- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్య సినిమాపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.. పని చేస్తా కానీ ఆ బాధ్యత వహించలేనంటూ
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Surya)ఇటీవల ‘రెట్రో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ మెప్పించలేకపోయాడు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Surya)ఇటీవల ‘రెట్రో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ మెప్పించలేకపోయాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది. ప్రస్తుతం సూర్య పాన్ ఇండియా సినిమా ‘వాడి వాసల్’(Vaadi Vasal) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీనికి వెట్రిమారన్(Vetrimaran) దర్శకత్వం వహిస్తున్నారు. వీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. దీనికి జీవీ ప్రకాష్ కుమార్(G.V. Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రకటన రిలీజ్ చేసి చాలాకాలమే అవుతున్నప్పటికీ విడుదలకు నోచుకోలేదు. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెట్రిమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సూర్యతో చేస్తున్న సినిమా గురించి యాంకర్ అడగ్గా.. ‘‘నేను సినిమాలు తెరకెక్కిస్తాను. 100 శాతం అంకితభావంతో పని చేస్తాను. అంతే తప్ప అంచనాలకు బాధ్యత వహించలేను. ఒకవేళ నా చిత్రాలు ఆడియన్స్ అంచనాలు అందుకుంటే ఆనందిస్తాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక అది చూసిన నెటిజన్లు ‘వాడివాసల్’ అప్డేట్స్ ఇవ్వాలని కోరుతున్నారు.






