అండర్ వాటర్ సీక్వెన్స్ ఎంతో కష్టపడి తీశాం.. డైరెక్టర్ కామెంట్స్‌తో సినిమాపై మరింత హైప్

by Chukka Sudharani |   (  Updated:2025-05-28 15:01:17  IST  )

విజయ్ ఆంటోని(Vijay Antony) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మార్గన్’ (Maargan).

అండర్ వాటర్ సీక్వెన్స్ ఎంతో కష్టపడి తీశాం.. డైరెక్టర్ కామెంట్స్‌తో సినిమాపై మరింత హైప్
X

దిశ, సినిమా: విజయ్ ఆంటోని(Vijay Antony) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మార్గన్’ (Maargan). మర్డర్ మిస్టరీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ ట్రైలర్ చూస్తుంటే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా అనిపిస్తోంది. సస్పెన్స్, క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లా కనిపిస్తోంది. ఇక ఇందులో చూపించిన షాట్స్, యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ అందరిలోనూ ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా విజయ్ ఆంటోనీ యాక్షన్, అజయ్ ధీషన్ ప్రజెన్స్ మరింతగా అంచనాలు పెంచేస్తున్నాయి.

ట్రైలర్ లాంచ్‌లో భాగంగా విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. ‘నాకు లియో జాన్ పాల్ ఐదేళ్లుగా తెలుసు. లీడింగ్ డైరెక్టర్లంతా కూడా లియోని ఎడిటర్‌గా పెట్టుకుంటారు. అతను చాలా గొప్ప ఎడిటర్. ‘మార్గన్’ కథను నాకు చెప్పినప్పుడు అతని స్టైల్ నాకు నచ్చింది. ‘మార్గన్’ ట్రైలర్ అందరికీ నచ్చింది. నా సిస్టర్ జయ కొడుకు అజయ్‌ని ఈ చిత్రంతో లాంచ్ చేస్తున్నాను. ‘మార్గన్’ చాలా గొప్పగా వచ్చింది. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. సీట్ ఎడ్జ్ ఇంటెన్స్ థ్రిల్లర్‌గా ఉంటుంది. జూన్ 27న రాబోతోన్న ‘మార్గన్’ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.

డైరెక్టర్ లియో జాన్ పాల్ మాట్లాడుతూ.. ‘దర్శకుడిగా ‘మార్గన్’ నాకు మొదటి చిత్రం. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన విజయ్ ఆంటోని సర్, రామాంజనేయులు సర్‌కు థాంక్స్. ఇంత వరకు నేను ఎడిటర్‌గా ఎన్నో చిత్రాలను చేశాను. కానీ విజయ్ ఆంటోని మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా ఎన్నో సినిమాలను చేశారు. ఆయన సహకారంతో నాకు ఈ సినిమా జర్నీ చాలా ఈజీగా మారిపోయింది. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. రాజమౌళి అంటే నాకు చాలా ఇష్టం. ఆయన తీసిన ఈగ, మగధీర అంటే నాకు చాలా ఇష్టం. ‘మార్గన్’ కోసం చాలా ఖర్చు పెట్టాం. అండర్ వాటర్ సీక్వెన్స్ ఎంతో కష్టపడి తీశాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ కూడా విజయ్ ఆంటోని ఏర్పాటు చేసిన సంస్థలోనే ఏకధాటిగా చేసేయొచ్చు. భాష్య శ్రీ మాకు మంచి డైలాగ్స్, పాటల్ని అందించారు. విజయ్ తన పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. అజయ్ ఏడీగా చాలా చిత్రాలకు పని చేశారు. కానీ ఇందులో అద్భుతంగా నటించాడు. అండర్ వాటర్ సీక్వెన్స్‌ కోసం అజయ్ చాలా కష్టపడ్డాడు. దీప్శిఖ, బ్రిగిడ చక్కగా నటించారు. జూన్ 27న మా ‘మార్గన్’ సినిమా రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

Next Story