Sarangapani Jathakam: ‘సారంగపాణి జాతకం’తో మరోసారి నవ్వించేందుకు వచ్చేస్తున్న ప్రియదర్శి..

by Chukka Sudharani |

ఏడాదికి మూడు, నాలుగు చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ప్రియదర్శి (Priyadarshi).. రీసెంట్‌గా ‘కోర్ట్’ చిత్రంతో వచ్చి మంచి హిట్ అందుకున్నాడు.

Sarangapani Jathakam: ‘సారంగపాణి జాతకం’తో మరోసారి నవ్వించేందుకు వచ్చేస్తున్న ప్రియదర్శి..
X

దిశ, సినిమా: ఏడాదికి మూడు, నాలుగు చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ప్రియదర్శి (Priyadarshi).. రీసెంట్‌గా ‘కోర్ట్’ చిత్రంతో వచ్చి మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మరో కొత్త మరో కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇంద్రగంటి మోహన కృష్ణ (Indraganti Mohana Krishna) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘సారంగపాణి జాతకం’ (Sarangapani Jathakam) అనే టైటిట్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తుండగా..రూపా కొడువయూర్ ఫీ మేల్ లీడ్‌లో అలరించనుంది. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన అప్‌డేట్ వినోదాత్మకంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే.. ఈ మూవీ గతేడాది డిసెంబర్ 20 న విడుదల కావాల్సి ఉండగా రిలీజ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

ఈ క్రమంలోనే తాజాగా మీడియా (Media)తో ముచ్చటించారు చిత్ర బ‌ృందం. ఇందులో భాగంగా డైరెక్టర్ ఇంద్రగింటి మోహన కృష్ణ మాట్లాడుతూ.. ‘ఇష్టమైన కథతో, నచ్చిన నటులతో, మెచ్చిన నిర్మాతతో పని చేసినపుడు.. ఎవరికైనా ఇలానే ఎప్పుడూ "సెట్స్"లో ఉండాలనిపిస్తూ ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే.. ‘ఈమధ్యకాలంలో ఒక తెలుగు సినిమా పాత్రికేయుల సమావేశంలో.. నటీనటులు మొదలుకొని, సాంకేతికవర్గ సభ్యుల వరకు, ప్రతి ఒక్కరు స్వచ్ఛమైన తెలుగు భాషలో, వినసొంపైన వాచకంతో మాట్లాడగా వినడం, చూడడం చాలా సంతృప్తినిచ్చింది. మా సినిమాలో హీరోయిన్ దగ్గర నుంచి అందరూ కూడా తెలుగు వాళ్లే కావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది’ అని తెలిపారు.

Next Story