- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిరంజీవిని విమర్శించిన వాళ్లు ఎప్పటికీ బాగుపడరు: వీవీ వినాయక్ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూనే, ఆయన్ని విమర్శించే వారికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూనే, ఆయన్ని విమర్శించే వారికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వినాయక్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి ఎంతో నిష్కల్మషమైన మనసున్న వ్యక్తి అని, ఆయన ఎప్పుడూ అందరూ బాగుండాలని కోరుకుంటారని వినాయక్ కొనియాడారు. "చిరంజీవిని ఎవరైతే అనవసరంగా విమర్శిస్తారో, వారు ఎప్పటికీ బాగుపడరు. అలా విమర్శించి కెరీర్ నాశనం చేసుకున్న వారు, పతనమైన వారు వందల మంది నాకు తెలుసు," అని వినాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నంది అవార్డుల ప్రస్తావన...
ఇటీవల తెలంగాణ గద్దర్ అవార్డుల వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ.. ఏపీలో కూడా నంది అవార్డులను పునరుద్ధరించాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరుపై వస్తున్న కొన్ని విమర్శలను వినాయక్ తీవ్రంగా ఖండించారు. రాజకీయాలకు అతీతంగా అందరూ గౌరవించే ఒక గొప్ప వ్యక్తిపై బురదజల్లడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. చిరంజీవి లాంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని పరోక్షంగా హెచ్చరించారు. మెగాస్టార్‌పై వినాయక్ చూపించిన ఈ ప్రేమాభిమానాలు చూసి మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. "డైరెక్టర్ అంటే ఇలా ఉండాలి.. తన హీరోని వెనకేసుకొచ్చే వినాయక్ గ్రేట్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






