Director VV Vinayak: ధనుష్ గొప్ప స్థాయికి ఎదగాలి.. ప్రముఖ డైరెక్టర్ వైరల్ కామెంట్స్

by Chukka Sudharani |

ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘థాంక్యూ డియర్’.

Director VV Vinayak: ధనుష్ గొప్ప స్థాయికి ఎదగాలి.. ప్రముఖ డైరెక్టర్ వైరల్ కామెంట్స్
X

దిశ, సినిమా: ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘థాంక్యూ డియర్’. తోట శ్రీకాంత్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో వీర శంకర్, నాగ మహేష్, రవి ప్రకాష్, ఛత్రపతి శేఖర్, బలగం సుజాత, సంక్రాంతి ఫేమ్ శ్రీనివాస్ నాయుడు తదితరులు కీలకపాత్రలు పోషించనున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రియల్ స్టార్ శ్రీహరి కుటుంబం నుండి వచ్చిన ధనుష్ రఘుముద్రి హీరోగా, హెబ్బా పటేల్, రేఖా నిరోషా హీరోయిన్లుగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న థాంక్యూ డియర్ చిత్రం గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. బాలాజీ నిర్మాతగా, శ్రీకాంత్ తోట దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. శ్రీహరి ఆశీర్వాదాలతో ధనుష్ భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

Next Story